కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించిన టీఆర్ఎస్ శ్రేణులు
జడ్చర్లటౌన్, మార్చి 13 : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఆదివారం టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్యతోపాటు కౌన్సిలర్లు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ సారిక, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్‌చందర్, కౌన్సిలర్లు చైతన్య, లత, ఉమాదేవి, హరిత, ప్రశాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పి.మురళి, ఖాజా ఇఫ్తెకార్, కృష్ణారెడ్డి, శ్యామ్, నిజాం, రాము, వీరేశ్, ఆండాళమ్మ తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, మార్చి 13 : మండలంలోని కుచ్చర్కల్లో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు వెంకటేశ్, స ర్పంచ్ సుధారాణీఆనంద్గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నగేశ్, శ్రీ శైలం, కృష్ణయ్య, రఘునాథ్, మహిపాల్, రాజునాయక్, హన్మంతు, సుదర్శన్, శ్రీహ రి తదితరులు పాల్గొన్నారు.