మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మార్చి 11 : జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పట్టుకొని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. సీఐ కథనం ప్రకారం .. పట్టణంలోని ఏనుగొండలో గంజాయి విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారంతో జిల్లా ఆబ్కారి అధికారి ఎస్.సైదులు ఆదేశాల మేరకు ఏనుగొండకు చెందిన సి.రమేశ్ వద్ద కొంత గం జాయి లభించింది. విచారించగా గంజాయి తాగడం ఏండ్ల నుంచి అలవాటు ఉన్నదని, అదేవిధంగా అవసరమైన వారికి విక్రయిస్తామని తెలిపారు.
ఈక్రమంలోనే కిద్వాయిపేటకు చెందిన కోడి నరేశ్ అక్కడికి ఒక కవర్‌తో రాగా అనుమానంతో అధికారులు అతడిని పట్టుకొని పరిశీలించారు. క వర్లలో సుమారు 140 గ్రాముల ఎండు గంజా యిని గుర్తించి వీరిద్దరి వద్ద మొత్తం 150 గ్రాము ల గంజాయిని సీజ్ చేశామన్నారు. అయితే గంజాయిని ఎంఏ సమీర్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు నరేశ్ తెలిపారు. సమీర్‌ను వెతకగా అతడు దొరకలేదన్నారు. వీరిద్దరిని మహబూబ్‌నగర్ నాయబ్ తాసిల్దార్ పార్థసారథి ఎదుట హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.
అయితే ఫిబ్రవరిలో నమోదైన గంజాయి కేసు లో పరారీలో ఉన్న ఏనుగొండ ప్రాంతానికి చెం దిన శశాంక్రెడ్డిని కూడా తాసిల్దార్ ఎదుట హాజరుపర్చి ముగ్గురినికి జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో డీటీఎఫ్ నర్సిరెడ్డి, ఎస్సై బి. శ్రీనివాస్, సుష్మా, కరుణ, కానిస్టేబుల్ రెడ్యానాయక్, కళానందం, వేణుగోపాల్, అరుణ్, అం జిలయ్య, బాలస్వామి, నాగరాజు, యాదయ్య, మల్లేశ్ సిబ్బంది పాల్గ్గొన్నారు.