కారేపల్లి, ఫిబ్రవరి 16 : లంబాడి సంక్షేమ సంస్కృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు సంతు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ మేదరి టోనీ, ఎస్ఐ బైరు గోపి, ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు భీమవరపు శ్రీనివాసరావు, మాజీ సొసైటీ సభ్యుడు అడ్డగోడ ఐలయ్య, కేలోత్ రాములుతో పాటు పలువురు సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కారేపల్లిలో ఘనంగా సేవాలాల్ జయంతి