ఉత్తరాది రైతుల పోరాట స్ఫూర్తితో కేంద్రంపై ఉద్యమం
ఉద్యోగ భద్రత కోసం దేశవ్యాప్తంగా ఆందోళన
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు
మహబూబ్‌నగర్, మార్చి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఢిల్లీలో రైతు చట్టాలపై ఉత్తరాది రైతులు ఏ విధంగా పోరాటం చేశారో.. అదే స్ఫూర్తిగా విద్యుత్ ఉ ద్యోగులు సైతం పోరాటం చేయాల్సి ఉన్నదని తెలంగా ణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయిబాబు పిలుపునిచ్చారు. రై తుల పోరాటానికి కేంద్రం దిగివచ్చిందని, ప్రధాని మో దీ క్షమాపణ చెప్పేలా రైతులు పోరాడారని ఆయన కొనియాడారు. విద్యుత్ ఉద్యోగుల ఉద్యోగ భద్రత కోసం దేశవ్యాప్త పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. శుక్రవారం మహబూబ్‌నగర్ బృందావన్ గార్డెన్స్‌లో జరిగిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ జిల్లా రెండో సర్వసభ్య సమావేశానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వా త రాష్ట్ర ప్రభుత్వం అంకితభావంతో విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టిందన్నారు.
రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యం మేరకు వి ద్యుత్ ఉద్యోగులంతా పగలూ రాత్రి తేడా లేకుండా ఎం తో కష్టపడి పనిచేశారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఆ దేశాల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల మెరుగైన ఉచిత విద్యుత్ అందిస్తున్నందు కు గర్వంగా ఉన్నదన్నారు. రైతులకు, అన్ని రకాల వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా విద్యుత్ సరఫరా చేయాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు పనిచేస్తున్నామని ఆయనన్నారు. కరోనా కాలంలోనూ ఎమర్జెన్సీ సర్వీసులో తమ ఉద్యోగులంతా పనిచేసినట్లు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే.. 5 రోజుల వేతనం కోత పెట్టినా.. వ్యతిరేకంగా పోరాటం చేశామన్నారు. సాగునీటి పథకాలైన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలతోపాటు రైతులకు కూడా కేంద్రం ప్రైవేటీకరణ ముసుగులో ఇబ్బంది పెట్టాలని చూస్తోందని హెచ్చరించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం సైతం ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తే ఊరుకునేదే లేదని.. మరో పోరాటనికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ మహబూబ్‌నగర్ సర్కిల్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా స్వామి, కార్యదర్శిగా ఎం.పాండు నాయక్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా యాదయ్యగౌడ్, అదనపు కార్యదర్శిగా రామకృష్ణ ను ఎన్నుకున్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి వెంకటేశ్వర్లు, అదనపు ప్రధాన కార్యదర్శి సీహెచ్ శంకర్, డిస్కమ్ అధ్యక్షుడు వేణు, డిస్కం కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.వెంకన్న, డిస్కమ్ అదనపు కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, డీఈలు చంద్రమౌళి, నవీన్‌కుమార్, మహబూబ్‌నగర్ సర్కిల్ కార్యవర్గం, డివిజన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.