పెబ్బేరు, మార్చి 11: ప్రభుత్వ మహిళా సాంకేతికవిద్య కళాశాల ఆవరణలో ఒప్పంద అధ్యాపకులు శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ఉమ్మడిజిల్లా అధ్యక్షుడు దశరథ్‌నాయక్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ అధ్యాపకుల చిరకాల కోరిక సీఎం కేసీఆర్ కృషితో నెరవేరబోతున్నదని హర్షం వ్యక్తం చేశారు.
కొత్తకోట చౌరస్తాలో..
కొత్తకోట, మార్చి 11: కొత్తకోటలోని చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తూ జీవో కాపీ విడుదల చేయడంపై జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, సర్పంచ్ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. అందుకు సహకరించిన మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గుంత మౌనిక, మాజీ జెడ్పీటీసీ పీజే బాబు, సర్పంచులు కృష్ణయ్య, నగేశ్, పరమేశ్, కురుమన్న, లక్ష్మణ్‌నాయక్, లక్ష్మీకాంతరెడ్డి, ఉశన్న, కౌన్సిలర్లు రామ్మోహన్‌రెడ్డి, పద్మఅయ్యన్న, నాయకులు శ్రీనూజీ, జగన్మోహన్రెడ్డి, పద్మ తదితరులు పాల్గొన్నారు.