అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు
అభివృద్ధికి కేరాఫ్ టీఆర్ఎస్
జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి
గులాబీ గూటికి చేరిన పలువురు
బాలానగర్, మార్చి 11 : నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్కు వలసల బాట పడుతున్నారని ఎమ్మెల్యే ల క్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే స్వగృహంలో బాలానగర్ మండలంలోని జాలుగడ్డతండాకు చెందిన 10 మంది కాంగ్రెస్ నాయకులు మాజీ స ర్పంచ్ రాములు నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షం లో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా టీ ఆర్ఎస్ పార్టీ నిలిచిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే టీఆర్ఎస్కు ఆదరణ లభిస్తుందని, వాటికి ఆకర్షితులయ్యే అన్ని పార్టీల నుంచి గులాబీ పార్టీ గూటికి చేరుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో అర్హులైన అన్ని వర్గాల గడప గడపకూ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్యానాయక్, సింగి ల్ విండో డైరెక్టర్ మంజూనాయక్, నాయకులు పాండునాయక్, లక్ష్మణ్‌నాయక్, లింగూనాయక్, పెంట్యానాయక్, సోమ్లానాయక్, ధర్మానాయక్, బిక్కూనాయక్ ఉన్నారు.