గద్వాలటౌన్, మార్చి 8: మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని రాణించి ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత విద్యార్థినులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ జలీల్ ఆధ్వర్యంలో మంగళవారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై కేక్‌కట్ చేశారు. అనంతరం విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఇంటర్ నోడల్ అధికారి హృదయరాజు, ప్రిన్సిపాళ్లు వీరన్న, కృష్ణయ్య హాజరై మహిళా అధ్యాపకులను సన్మానించారు.
అబల అనుకుంటే అంతరిక్షం ఆమె సొంతం
ధరూరు, మార్చి 8: అబల అనుకుంటే అంతరిక్షం కూడా ఆమె పాదాల కిందకు వస్తుందని జిల్లా నోడల్ ఆఫీసర్ నరేశ్ అన్నారు. మండలంలోని రేవులపల్లి జెడ్పీహెచ్ఎస్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న వంట ఏజెన్సీ కార్మికులు, మహిళా ఉపాధ్యాయులు, స్వచ్ఛ కార్మికులు, ఎంవీఎఫ్ కార్యకర్తలను ఆహ్వానించి సన్మానించారు. కార్యక్రమంలో సుజాత, మంజుల, మాణిక్యమ్మ, గోవిందమ్మ, ఎంవీఎఫ్ అనిత, ఉపాధ్యాయులు విష్ణు, తిమ్మారెడ్డి, మల్లప్ప, అరవింద్, రజనీకాంత్, గజేంద్ర, గోపినాథ్, విద్యార్థినులు పాల్గొన్నారు.
మహిళా గౌరవమే.. దేశ గౌరవం
అలంపూర్, మార్చి 8: మహిళలు ఎక్కడ గౌరవింపబడుతారో అక్కడ సిరిసంపదలు వెల్లివిరుస్తాయని భారత్ పెట్రోలియం పంప్ కోఆర్డినేటర్ కిషన్‌రావు అన్నారు. మంగళవారం జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కంపెనీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 44వ జాతీయ రహదారిపై ఇటిక్యాలపాడు శివారులోని ఔట్లెట్ ఇంధనం కోసం వచ్చే వినియోగదారుల వాహనాల్లోని మహిళలకు మిఠాయిలు, పుష్పాలు ఇచ్చి వినూత్న రీతిలో గౌరవించారు. కార్యక్రమంలో ఔట్లెట్ మేనేజర్ శ్రీకాంత్ , పంపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహిళా ఉద్యోగులకు సన్మానం
ఉండవెల్లి, మార్చి 8: మండల కేంద్రంలోని రైతువేదికలో మానవపాడు, ఉండవెల్లి మండలాల్లోని వైద్య, ఆరోగ్యశాఖలో పని చేస్తున్న మహిళా డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలను ఎస్బీఐ ఫౌండేషన్, ఎస్బీఐ సంజీవని ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్లు శశికిరణ్, రామ్‌నాథ్, ఎస్బీఐ సంజీవని మెడికల్ ఉద్యోగి తస్లిమ్, ల్యాబ్ టెక్నీషియన్ రామచంద్ర, రామ్మోహన్, సర్పంచ్ రేఖ తదితరులు పాల్గొన్నారు.