ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
కోస్గి, మార్చి 5: కోస్గి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా పట్టణంలో రోడ్డు విస్తరణకు అందరూ సహకరించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కోరారు. శనివారం మున్సిపాలిటీలోని 1,2,7వ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఏడో వార్డులో డ్రైనేజీ, పాఠశాలను మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా అదనపు తరగతిగదుల నిర్మాణం చేపడుతామని, విద్యార్థులకు తగిన వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం రోడ్డువిస్తరణలో భాగంగా స్థానిక వ్యాపారస్తులు, ప్రజలతో మార్కెట్‌యార్డు ఆవరణలో సమావేశమయ్యారు. ప్రభు త్వం తరఫున 33 ఫీట్లమేరకు ఇరువైపులా రోడ్డువిస్తరణ చేయాలని ఆర్అండ్బీ అధికారులు నిర్ణయించినా స్థానిక ప్రజల అభిప్రాయం మేరకే పనులు చేపడుతామని ఎమ్మె ల్యే ప్రజలకు హమీఇచ్చారు. దీంతో ఇరువైపులా 20 ఫీట్లు రోడ్డు విస్తరణ చేపట్టాలని ప్రజలు, వ్యాపారస్తులు కోరడంతో అందు కు ఆర్అండ్బీ అధికారులు పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం అందించే డబుల్బెడ్రూం ఇండ్ల్లలో ప్రాధాన్యత ఇస్తామని మొదటగా వారికే ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఇండ్లు కోల్పోయినవారు అధైర్యపడొద్దని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస ్థచైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్ వీరారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు రాజేశ్, హరి తదితరులున్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
మద్దూర్ మార్చి 5: మండలంలోని దోరేపల్లి గ్రామానికి చెందిన రవికుమర్కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.లక్ష చెక్కును శనివారం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆయన నివాసంలో అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం పని చేస్తుందన్నారు.