మాగనూరు /కృష్ణ నవంబర్13: స్పెల్ బీ పోటీల్లో కున్సి విద్యార్థులు సత్తా చాటారు. బుధవారం నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుల పండుగ సందర్భంగా నిర్వహించిన స్పెల్ బీ తెలుగు అండ్ ఇంగ్లీష్ చదవడం, క్విజ్ పోటీలలో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కున్సి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
యూపీఎస్ స్థాయిలో జరిగిన నాలుగు ఈవెంట్లలోనూ ప్రథమ బహుమతులు కైవసం చేసుకోవడంతో పాటు మొత్తం 11 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచి, జిల్లా స్థాయిలో జరగబోయే పోటీలకు కృష్ణ మండలానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.సంతోషి, ఉపాధ్యాయ బృందం, పాఠశాల చైర్మన్ దీప, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి పోటీల్లో కూడా విద్యార్థులు మరింత ప్రతిభ చూపాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.