గద్వాల న్యూటౌన్, ఆగస్టు 25 : సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి మోసపోయారా..? అయితే వేగంగా స్పందించండి.. దేశంలో పెరిగిన సైబర్ నేరాలపై కేంద్ర హోంశాఖ అప్రమతమైంది. వా టిని నిరోధించేందుకు చర్యలు చేపడుతూనే సైబ ర్ మోసానికి గురైన వారు ఫిర్యాదులు చేసేందు కు డయల్ 155260 నంబర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే రాష్ట్ర పోలీస్‌శాఖ డయల్ 100 ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నది. అయితే సైబర్ నే రాలు ఎక్కువగా నార్త్ ఇండియా నుంచే జరుగుతున్న నేపథ్యంలో నేరస్తులను పట్టుకోవడం స మస్యగా మారిందని పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకున్న వారు 24 గంటల్లోగా ఫిర్యాదు చేస్తే డబ్బులు తిరిగి రాబట్టే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. సైబర్ వలలో చిక్కినవారు ఏ ఖాతా నుంచి ఎంత డబ్బులు పొగొట్టుకున్నారో ఫిర్యాదులో పేర్కొన్న వెంటనే సైబర్ క్రైం అధికారులు క్షణాల్లో ఆ ఖాతా నుంచి డబ్బులు ఏయే మార్గాల ద్వారా ఎవరి ఖాతాల్లోకి చేరాయన్నది తెలిసే అవకాశం ఉంటుందంటున్నారు.
మాయమాటల్లో పెట్టి..
సైబర్ నేరగాళ్లు మాయమాటలతో మభ్యపెడుతారు. వారి మాటలు నమ్మి ఖాతాల్లో ఉన్నదంతా ఖాళీ చేసుకోవద్దు. ప్రధానంగా వివిధ ఆన్లైన్ షాపింగ్ యాప్‌ల ద్వారా పలు రకాల సంస్థల నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఆఫర్లు ఇచ్చి ఆగం చేస్తారు. సోషల్ మీడియా ప్రముఖ వ్యక్తుల పేర్లమీద నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి అత్యవసరంగా డబ్బులు కావాలని, రూ.లక్షలు విలువజేసే లాటరీ తగిలిందని ముందుగా కొంత డబ్బులు కట్టాలని మోసం చేయడం.. తక్కువ ధరలకే వాహనాలు వస్తువులు వస్తాయని చెబుతూ మోసం చేస్తుంటారు. గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి ఫోన్లు చేస్తున్నామని చెప్పి ఏటీఎం పిన్ నంబర్, ఆధార్ నంబర్లు, వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు. అయితే, బ్యాంకుల నుంచి ఎప్పుడూ పిన్ నంబర్లు, ఆధార్ కార్డు నంబర్లు ఫోన్ చేసి అడగరనే విషయం తెలిసినా.. కొందరు వ్యక్తిగత వివరాలను చెప్పి మోసపోతున్నారు. ఖాతాలో డబ్బులు ఖాళీ అయ్యాక గానీ తాము మోసపోయామని గ్రహించలేకపోతున్నారు. చాలా మంది మోసపోయినా పోలీసులకు ఫిర్యాదులు చేయడం లేదు. దీంతో సైబర్ నేరగాళ్లు రోజుకో అవతారం ఎత్తి సులువుగా డబ్బులు కాజేస్తున్నారు.
అప్రమత్తత అవసరం..
సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకులు వ్యక్తిగత వివరాలు ఫొన్లో అడగరు. ఏదైనా సమస్య ఉంటే బ్యాంకుకు వెళ్లి మాట్లాడాలే తప్పా ఫొ న్కు వచ్చే మెస్సేజ్‌లు, కాల్స్‌కు వ్యక్తిగత వివరా లు ఇవ్వొద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నా రు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్లో ఎదుటి వ్యక్తులు అడిగిన సమాచారం ఇవ్వకూడంటున్నారు. ఏదేని పరిస్థితుల్లో మోసపోతే వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
24 గంటల్లోగా ఫిర్యాదు చేయాలి..
మోసపూరిత లావాదేవీలను వెంటనే నిలిపివేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్ 155 260, డయల్ 100కు కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. 24 గంటల్లోగా ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖా తాలను నిలిపివేయనున్నారు. కాజేసిన నగ దు బాధితుడి ఖా తాలో తిరిగి జమ చేసే అ వకాశం ఉం టుంది. ఎన్సీఆర్పీ పోర్టల్ www.cyber crime.gov.inలో ఫిర్యాదు చేస్తే దగ్గర్లో ని పోలీస్‌స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు. జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా 2019-2021లో 34 కేసులు నమోదు కాగా.. ఎనిమిది కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 16 కేసులు డిస్పోల్ కాగా 10 కేసులు ప్రొసెసింగ్‌లో ఉన్నాయి.
అప్రమత్తంగా ఉండాలి..
ఆన్లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. మాయమాటలు చెప్పి అకౌంట్లో డబ్బులు కాజేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల ఖాతాలకు డబ్బులను పంపించకండి. ఒకవేళ మోసపోతే 24 గంటల్లో ఫిర్యాదు చేయండి. మీ డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. సైబర్ నేరాలను ఆరికట్టేందుకు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.