జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలానికి నీతి ఆయోగ్ గుర్తింపు దక్కింది. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన సంపూర్ణత అభియాన్‌లో మూడు కీలక సూచికలపై వంద శాతం ప్రదర్శనతో రాష్ట్రస్థాయి గుర్తింపు పొందింది.
2024 జూలై-సెప్టెంబర్ మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భిణుల ప్రసూతి మందు సేవలు (ANC), మధుమేహం, అధిక రక్తపోటు స్క్రీనింగ్‌లో గట్టు మండలం నూటికి నూరు శాతం విజయవంతమైంది. ఈ గౌరవాన్ని పురస్కరించుకుని, 2025 ఆగస్టు 2న రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్‌కు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కాంస్య పతకాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘గట్టు మండల అభివృద్ధి పట్ల ఇది ఒక గర్వకారణమైన ఘట్టం’ అని తెలిపారు.