మక్తల్ టౌన్, మే 6 : పేదలకు సీఎం రిలీఫ్‌ఫండ్ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాలు, పట్టణానికి చెందిన 35 మందికి రూ.16లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పారేవుల గ్రామానికి చెందిన రేఖ అనే కాన్సర్ బా ధితురాలికి రూ.8 లక్షల ఎల్వోసీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా మక్తల్ నియోజకవర్గంలో సీఎంఆర్ చెక్కులు అందజేశామని తెలిపారు. అనారోగ్యంతో బాధపడే పేదలు ఎవరైనా సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి, మాగనూర్ జెడ్పీటీసీ వెంకటయ్య, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్
ఊట్కూర్, మే 6 : రాష్ట్రంలో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. బాధితులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం ఎమ్మెల్యే అందజేశారు. పెద్దజట్రం గ్రామానికి చెందిన రాములుకు రూ.40 వేలు, నిడుగుర్తి గోపాల్‌రెడ్డికి రూ.60 వేలు, ఎడవెల్లి సన్నీకి రూ. 11 వేలు, రామప్పకు రూ. 32 వే లు, మొగ్దుంపూర్ నారాయణకు రూ. 24 వేలు, పులిమామిడి శ్రావణ్‌కుమార్‌కు రూ. 60 వేలు, బాపూర్ లక్ష్మయ్యకు రూ. 60 వేలు, రవికి రూ. 20 వే లు, ఓబులాపురం అంజప్పకు రూ. 24 వేల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ సుమంగళి, ఎంపీటీసీలు రవి, అనిత, విండో మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.