ధరూర్, జూలై 4 : ఆధ్యాత్మిక జీవితంతో ప్రజలందరూ సుఖ శాంతులతో తులతూగాలంటే ప్రతిగ్రామంలో ఆలయం ఉండాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నూతన శివాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే దంపతులు ఆదివారం భూమిపూజ చేసి శంకు స్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్యే దంపతులకు సర్పంచ్ పద్మమ్మ స్వాగతం పలికి వారితో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఊరు, దేశం బాగు పడాలంటే ప్రతి ఊరిలో బడి, గుడి తప్పనిసరిగా ఉండాలన్నారు. గ్రామం లో ప్రజలందరినీ ఐక్యంగా ఉంచే స్థావరాలు ఏవైనా ఉన్నాయంటే అవి దేవాలయం, విద్యాలయం మాత్రమేనన్నారు. గ్రామస్తులందరూ ఐక్యంగా ఆలయ నిర్మాణానికి కృషి చేయాలని, ఆలయ నిర్మాణానికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ప్రభుత్వం ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేయడానికి అధిక ఖర్చు చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమం లో గట్టు ఎంపీపీ విజయ్‌కుమార్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ నర్సింహులు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, జాకీర్, సర్వారెడ్డి, సురేష్‌శెట్టి, డీఆర్ విజయ్, భీమ్‌రెడ్డి, సత్యారెడ్డి, తిరుమల్‌రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, అబ్రహం, జిల్లా సమన్వయకర్తలు జాంపల్లె భరతసింహారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు లింగయ్య, జంగం రాజు, రంగన్న, నర్సింహులు, భాస్కర్‌రెడ్డి, చిరప్ప, గ్రామస్తులు పాల్గొన్నారు.
అయ్యప్ప మరణం తీరనిలోటు
గట్టు, జూలై 4 : టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అయ్యప్ప మృతి తీరని లోటని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అనారోగ్యంతో అయ్యప్ప శనివారం మృతిచెందగా ఎమ్మెల్యే ఆదివారం పెంచికపాడులో ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప పార్టీకి పెద్దదిక్కుగా ఉండేవాడని గుర్తుచేశారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ విజయ్‌కుమార్, పీఏసీసీఎస్ చైర్మన్ క్యామ వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులు రామకృష్ణారెడ్డి, హనుమంతురెడ్డి, అంగడి బస్వరాజు, సురేశ్‌శెట్టి, రాము పాల్గొన్నారు.