భూత్పూర్, మే 3 : కరోనా సెకండ్ విస్తరిస్తు న్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని మండల ప్రాథమిక ఆరోగ్యాధికారి సంధ్యాకిరణ్మయి సూచించారు. సోమవారం ఆమె మా ట్లాడుతూ రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఏ స్థాయి వ్యక్తులను వైరస్ వదలడం లేదన్నారు. సరైన నిబంధనలు పాటించకపోవడం వల్లే కేసులు పె రుగుతున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా 4 ల క్షలకు చెరువలో రోజుకు కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. అందుకే ప్రజలు కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించి వైరస్ను కట్టడం చేయాలని సూచించారు. అలాగే మొదటి దశ వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండో దశ టీకాను 6-8 వారాల మధ్య తీసుకోవాలని డాక్టర్ తెలిపా రు. ప్రతిఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలన్నా రు. అందరూ మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడటంతోపాటు సామాజిక దూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ యాద మ్మ, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసులు, ఏఎన్ఎం తదితరులు పాల్గొన్నారు.