IT Raids | జోగులాంబ గద్వాల, అక్టోబర్ 7 : హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పప్పు దినుసులు, హోల్‌సేల్, వ్యాపారుల ఇళ్లల్లో ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారి ప్రక్కన ఉన్న వికేర్ సీడ్స్ వ్యవసాయ ప్రైవేట్ ప్రాసెసింగ్ కేంద్రంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఉండవల్లి సమీపంలోని వీ కేర్ సీడ్స్ కంపెనీలో పప్పు దినుసులపై పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లుగా సోదాల్లో ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఐటీ శాఖ అధికారుల తనిఖీల నేపథ్యంలో మీడియాను అనుమతించని పోలీసులు.. సంస్థ యజమానులు, సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటికే ఐటీ అధికారులు హైదరాబాద్‌లోని కొండాపూర్, కూకట్పల్లి ప్రాంతాలలో సోదాలు చేపట్టారని తెలిసిందే. మరోవైపు మహబూబ్‌నగర్, ఏపీలోని గుంటూరులో, కర్నూలు జిల్లాలో పప్పు దినుసుల హోల్‌సేల్ వ్యాపారుల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Kumram Bheem | కుమ్రం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి : బానోత్ గజానంద్
Chief Justice BR Gavai | చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి హేయమైన చర్య : గుణిగంటి మోహన్
Metpalli | సీజేఐపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ