అలంపూర్ ఆగస్టు 07 : గద్వాల అలంపూర్ మండల కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో డిప్యూటీ ఇంజినీర్ శ్రీకాంత్ నాయుడు ప్రైవేట్ కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు చిక్కారు. వివరాలకు వెళ్తే అలంపూర్ మున్సిపాలిటీలోకి సంబంధించి ఎంబీ మెజర్మెంట్ రికార్డు చేసే విషయంలో సంబంధిత కాంట్రాక్టర్ నుండి డీఈ శ్రీకాంత్ నాయుడు లంచం డిమాండ్ చేశారు.
సుమారు నాలుగు లక్షలకు సంబంధించిన పని కోసం త్రీ పర్సెంట్ లంచం కావాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా 11 వేల రూపాయలు ఇవ్వాలని కోరగా అందుకు ఇష్టపడని ప్రైవేట్ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు లంచం ఇస్తుండగా డీఎస్పీ తమ సిబ్బందితో గురువారం ఇరిగేషన్ కార్యాలయం పై దాడి చేశారు. ఈ దాడిలో ఇన్స్పెక్టర్ ఎండీ ఖాదర్ జిలానీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.