జోగులాంబ గద్వాల : గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దంపతుల మధ్య గొడవ భార్య ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే..మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన తిమ్మప్ప, మహేశ్వరి భార్యాభర్తలు. భార్యాభర్తల మధ్య గొడవ జరగా ఆవేశానికి లోనైన తిమ్మప్ప తన భార్య మహేశ్వరిపై కొడవలితో తలపై దాడి చేశాడు. మహేశ్వరికి తీవ్ర గాయలయ్యయి.
గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం గద్వాల దవాఖానకు తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం కర్నూల్ హాస్పిటల్కు తరలించారు. భర్త తిమ్మప్ప వ్యసనాలకు బానిసై తరుచు భార్యతో గొడవ పడే వాడని మద్యం మత్తలోనే భార్యపై దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తిమ్మప్పను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.