గద్వాల: రైతు కుటుంబాలకు చేయూత నివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన రైతు సవారి అనారోగ్యంతో మరణించగా ఆయనకు ప్రభుత్వం నుండి మంజూరైనా రైతు బీమా రూ.5లక్షల చెక్కును ఆయన భార్య శ్రీలతకు ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. రైతులు మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా రైతు బీమా పథకం ప్రవేశ పెట్టి వారికి చేయూతని స్తుందని చెప్పారు. రైతులు ఎవరూ అధైర్య పడొద్దని అందరికీ అండగా ప్రభుత్వం ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్, కౌన్సిలర్లు మురళి, కృష్ణ, పాగుంట ఆలయ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, నాయకులు రమేశ్నాయిడు, జాకీర్, అజయ్, గోవిందు, రాము తదితరులు పాల్గొన్నారు.
పేదల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం
పేదల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు.గద్వాల నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైనా చెక్కులను బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే అందజేశారు. చెక్కు లు అందుకున్నవారిలో గద్వాల పట్టణం 25 వార్డుకు చెందిన లక్ష్మికి రూ.లక్ష, గట్టు మండలం తుమ్మలపల్లికి చెందిన శివకర్ణగౌడ్కు రూ.లక్ష, మహేష్‌కుమార్‌కు రూ.29,500, సరోజమ్మకు రూ.53,700, పెద్ద వెంకటన్నకు రూ.24వేల చెక్కులను వారి కుటుంబాలకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్‌కుమార్, సర్పంచ్‌లు మజీద్, పురు షోత్తంరెడ్డి, నాయకులు నీలేశ్వర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.