జోగులాంబ జిల్లా గద్వాల నియోజకవర్గంలో పంటలు ఎండి పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. నెట్టెంపాడు లిఫ్ట్ కింద 104 ప్యాకేజీలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, ఈ ప్యాకేజీ కింద చివరి ఆయకట్టులో ఇప్పటికే చేతికొచ్చిన పంటలను వదులుకోలేక రైతులు విలవిలలాడుతున్నారన్నారు. శుక్రవారం కేటీ దొడ్డి మండలం కొండాపురం, గువ్వలదిన్నె, వెంకటాపురం, ఈర్ల బండ, గంగన్పల్లి, ఇర్కిచేడు గ్రామాల పరిదిలో పంటపొలాలను D.E.రామ్ కిషోర్‌తో పాటు, రైతులతో కలిసి ఆయన సందర్శించారు. రైతుల బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జూరాలలో నీళ్లున్నా ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి 104 ప్యాకేజ్ కింద కాలువకు నీళ్లెందుకివ్వట్లేదని అధికారులను ప్రశ్నించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా ఎగ్గొడితిరి, రైతు భీమా ఇవ్వకపోతిరి, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకిచ్చిన ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయట్లేదని మండిపడ్డారు. కనీసం రైతులు వేసిన పంటలకు నీళ్లైనా ఇవ్వండని, 104 ప్యాకేజ్ కింద చివరి ఆయకట్టు వరకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని ఫోన్ చేసి S.E.రహీముద్దీన్‌ను కోరారు.
Gadwal 2
ఈ విషయంలో రైతులు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా పట్టించువోడం లేదన్నారు. సాగు నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. చివరి దశకు పంటలు చేరుకున్నతరుణంలో నీళ్లు వదిలేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు. రెండు రోజుల్లో కాలువలకు నీరు వదలకుంటే BRS పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే 450 మంది రైతులను సీఎం రేవంత్‌రెడ్డి పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్లేమో పాతాళంలోకి పోయాయని, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయని, నియామకాలు గాల్లో కలిసిపోతున్నాయని విమర్శించారు. పరిపాలన చేతగాక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సీఎం రేవంత్ రెడ్డిలో అసహనం పెరిగిపోతోందని,అందుకే ఆయన నోటికొచ్చినట్లు కేసీఆర్‌ను, బీఆర్‌ఎ్‌సను విమర్శిస్తున్నారని హనుమంతు నాయుడు పేర్కొన్నారు.
Gadwal 1
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మోనేష్,నూర్ పాషా,మల్దకల్ మండల పార్టీ నాయకులు డి.శేఖర్ నాయుడు, ధరూర్ వెంకటేష్ నాయుడు, బీచుపల్లి, ఎస్.రాము నాయుడు, ప్రహ్లాద్, శ్రీనివాసులు, DR.నాయుడు, నల్లగట్ల రాముడుతోపాటు నెట్టెంపాడు చివరి ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.