గద్వాల : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మద్దుతు తెలిపేందుకు హైదరాబాద్కు వెళ్తున్న గట్టు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఎస్.రాము నాయుడు, వెంకటేష్, కృష్ణ, రవి, కంగారు తిమ్మప్ప, ఆంజనేయులు, పిల్లి తిమ్మప్ప, మిట్టదొడ్డి నాగరాజు, మంగలి ఆంజనేయులు, ఆనంద్ ఉన్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. గత ఐదారు సంవత్సరాలుగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి తెలిపారు. డ్రగ్స్ కేసు, హీరోయిన్లతో సంబంధాలు అంటూ అనేక అంశాల్లో ఇరికించాలని చూశారని పేర్కొన్నారు.
నన్నే కాదు, నా కుటుంబాన్ని కూడా మానసిక క్షోభకు గురిచేశారని చెప్పారు. కేసీఆర్ సైనికులుగా కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి చేసే దాకా కలిసికట్టుగా పని చేస్తామని స్పష్టం చేశారు. సంఘీభావం చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై, రేవంత్ రెడ్డి అవినీతిపై 100 శాతం ప్రాణం పోయే దాకా పోరాడుతూనే ఉంటామన్నారు. అటెన్షన్ డైవర్షన్ గేమ్ లు ఆడినా.. అర్జునుడి కన్ను మాదిరి రేవంత్ రెడ్డి అవినీతిపై, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు పైనే మా పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు.