గద్వాల : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బరితెగించారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ వేస్తే.. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, పార్టీ ఫిరాయించలేదని చెప్పుకున్న కృష్ణమోహన్‌రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నాడు.
స్పీకర్ అనర్హత పిటిషన్‌ను కొట్టేయడంతో గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రచారాన్ని భుజానికి ఎత్తుకుని తిరుగుతున్నారు.
ఇవాళ మున్సిపాలిటీలో తిరుగుతూ కాంగ్రెస్ కరపత్రాలను ఓటర్లకు పంచుతున్నారు. కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని ఓటర్లను అడుగుతున్నారు. నిన్న మొన్నటి వరకు అంటి ముట్టనట్లు ఉన్న బండ్ల ఇవాళ బరితెగించి హస్తం గుర్తు ఉన్న కరపత్రాలను బహిరంగంగా పంచడం చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఫిరాయింపు ఎమ్మెల్యేపై బండ్లపై చర్య తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.