అయిజ రూరల్: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎల్లప్పుడూ రైతుల వెన్నంటే ఉంటామని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొ న్నారు. గురువారం మల్దక ల్ మండలం నాగర్‌దొడ్డి గ్రామ సమీపంలో నిర్మించిన నాగర్‌దొడ్డి రిజర్వాయర్‌ను రైతులు, నాయకులతో కలిసి సందర్శించారు. రిజర్వాయర్ కాలువలో పిచ్చి మొక్కలు, జమ్ము, మొలవడంతో నీటి పారుదలకు ఇబ్బందిగా ఉందని రైతులు, నాయకులు రెండురోజుల క్రిందట ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన స్పందించి గురువారం డ్యాం, కాలువలను క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు.
అనంతరం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ డ్యాంను పూర్తి స్థాయిలో నీటితో నింపాలని సూచించారు. నీరు వృధా కాకుండా చూసుకోవాలన్నారు. కాలువలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు. ఇందుకు స్పందించిన అధికారులు త్వరలో టెండర్ నిర్వహించి పిచ్చిమొక్కలు తొలగించి డ్యాంను పూర్తిస్థాయి నీటితో నింపుతామని తెలిపారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా ఉండి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకై వ్యవసాయానికి 24గంటలు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుభీమా తదితర పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే రైతులకు కావల్సిన ఎరువులు, విత్తనాలను సబ్సీడీపై అందించి, పండించిన దాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని భూములన్నిటికీ సాగు నీరును అందిస్తామని తెలిపారు.
ఇప్పటికే నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగు నీరు అందించేందుకు తుమిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని త్వరలో దాని పరిధిలో రిజర్వాయర్ల నిర్మాణాలను చేప ట్టి అలంపూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పటేల్ విష్ణువర్దన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిన్నదేవన్న, రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్‌రావ్, ఈఈ వెంకటేశ్వర్రావ్, డీఈ శివప్ప వాసంతి, ఏఈఈ సూర్యప్రకాశ్‌రెడ్డి, ఏఈ అనురాధ, రైతులు ఉన్నారు.