Israel Job | జోగులాంబ గద్వాల జిల్లా : ‘మంచి ఉద్యోగం.. ఇజ్రాయిల్ పంపిస్తా’ అని నమ్మబలికిన ఓ ఏజెంట్ ఏకంగా 10 మందిని మోసం చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగుచూసింది. సదరు ఏజెంట్ ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు చెందిన వారిని విజిట్ వీసాపై ఇజ్రాయిల్‌కు తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక ఆ దేశం నుండి పంపేయడంతో ఇండియాకు వచ్చారు బాధితులు. తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఏజెంట్‌ను కోరగా అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన చేయడంతో బాధితులు సోమవారం జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
బాధితులు తెలిపిన వివరాల మేరకు విజిట్ వీసాపై ఇజ్రాయిల్ కు తీసుకెళ్లాడు. ఆ ఏజెంట్ ఒక్కొక్కరి నుంచి రూ.8.6 లక్షలు తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన బాలక్రిష్ణ, ప్రసాద్, చిట్టిబాబు, ప్రభుదాస్, భారతీ, సునీల్, రత్న కుమారి, బేబి కిషోర్, విజయ్ మోహన్, పద్మతోపాటు మరికొందరు ఇజ్రాయిల్‌లో ఉద్యోగాల కోసం జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో ఓ చర్చి ఫాస్టర్ కె సుదర్శన్ అలియాస్ అబ్రహాంను సంప్రదించారు.
అయితే కే సుదర్శన్ విజిట్ వీసా పేరుతో ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ.8 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేశాడు. జూన్ 9, 2024 సంవత్సరంలో కోనసీమ జిల్లాలకు చెందిన మొత్తం 42 మందిని టూరిస్ట్ వీసా పేరు మీద ఇజ్రాయెల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కొన్ని ప్రదేశాలు చూసిన తర్వాత అక్కడే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాడు.
ఎవరికైనా చెప్పుకోండి.. నేనేది ఇచ్చేది లేదంటూ..
కొంత కాలం తర్వాత ఆ దేశం అధికారులు టూరిస్ట్ వీసా మీద వెళ్లిన వారిని తిరిగి భారత్‌కు పంపించేశారు. వీసా ఖర్చులు, టికెట్ ఖర్చులు పోగ మిగిలిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఏజెంట్ కె సుదర్శన్‌పై ఒత్తిడి తేగా.. అందుకు తగ్గటు బాధితులకు చెక్కులు అందజేశాడు. బ్యాంకులో డబ్బులు లేకపోవడంతో బాధితులు నిలదీయగా ఈ రోజు, రేపు అంటూ కాలయాపన చేశాడు. కొందరి బాధితులకు కొంత నగదు ఇవ్వడం జరిగిందని, మాకు కూడా డబ్బులు ఇవ్వాలని ఏజెంట్‌పై ఒత్తిడి తేగా ఎవరికైనా చెప్పుకోండి.. నేనేది ఇచ్చేది లేదంటూ బాధితులపై బెదిరింపులకు పాల్పడటంతో బాధితులు వారం రోజుల నుంచి ధరూర్ మండల కేంద్రంలోని చర్చిలో ఉంటున్నారు.
నేటికి ఏజెంట్ అబ్రహాం డబ్బులు ఇవ్వకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు బాధితులు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక రోడ్లపై తిరుగుతున్నామని, ఇప్పటికైనా న్యాయం చేసి తమ డబ్బులు తమకు చెల్లించాలని బాధితులు కోరారు.
Stray dogs | పెద్దపొర్ల గ్రామంలో వీధి కుక్కల స్వైర విహారం.. పలువురికి గాయాలు
Medical Seat | నీట్ యూజీ పరీక్షలో ఆటో డ్రైవర్ కూతురికి మెడికల్ సీట్