
అయిజ, ఆగస్టు 24 : చేనేత సహకార సంఘా ల సొసైటీ పాలకవర్గ గడువును మరో ఆరు నెల లు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పాలకవర్గ గడువు ముగిసినప్పటికీ చేనేత కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకా ల అమల్లో ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశం తో మరో ఆరు నెలలు పొడిగిస్తూ జీవో విడుదల చేసింది. 2013 ఫిబ్రవరి 10న జరిగిన ఎన్నికల్లో బాధ్యతలు చేపట్టిన పాలకవర్గాల గడువు ఫిబ్రవరి 11, 2018తో ముగిసింది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 10న పొడిగించిన గడువు.. ఆగస్టు 9న ముగియగా, మళ్లీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 90 చేనేత సహకార సంఘాల సొసైటీ పాలకవర్గాలు ఫిబ్రవరి 9, 2022 వరకు పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగనున్నాయి.
చేనేత కార్మికుల లబ్ధి కోసం ..
ప్రస్తుతం చేనేత సహకార సంఘాల సొసైటీల కు వెంటనే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడం, కార్మికులకు ప్రవేశపెట్టిన ‘చేనేత మిత్ర’ నే తన్నకు చేయూత, త్రిఫ్ట్ ఫండ్, నేత కార్మికుల వ్య క్తిగత రుణాలు, రుణమాఫీ పథకం అమలు చే యాలంటే పర్సన్ ఇన్చార్జిల పాలన అవసరమని గుర్తించిన ప్రభుత్వం గడువును పొడిగిస్తూ వస్తున్నది. గతంలోనే పదవీకాలం పూర్తి అయినప్పటి కీ ప్రభుత్వం సొసైటీలకు గడువు పొడిగించింది. మరోసారి గడువు పొడిగించడంతో చేనేత సహకార సంఘాల సొసైటీ పాలకవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చేనేత, ప వర్లూం, ఉన్ని, టైలరింగ్, గార్మెంట్ సహకార సంఘాలు కలిపి 103 ఉన్నాయి. ఇందులో సు మారు 14 వేల మంది చేనేత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. వీటిలో మొదటి విడుతగా 13 స హకార సంఘాలకు ఎన్నికలు పూర్తికాగా, ప్ర స్తుతం 90 చేనేత సహకార సంఘాల సొసైటీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఇందులో 33 చేనేత సహకార సంఘాల సొసైటీలు, 25 టైలరింగ్, 15 ఉన్ని, పవర్లూం తదితర సంఘాలు ఉన్నా యి. జోగుళాంబ గద్వాల జిల్లాలో 19 (చేనేత స హకార సంఘాలు 10, టైలరింగ్ 7, పవర్లూం 1, సిల్క్ సొసైటీ 1), వనపర్తిలో 13, నాగర్కర్నూల్లో 10, మహబూబ్నగర్లో 48 సహకార సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘం కార్యవర్గంలో 9 మంది డైరెక్టర్ల చొప్పున 810 మంది ఉన్నారు. వీరంతా ఫిబ్రవరి 9, 2022 వరకు పా లకవర్గం పర్సన్ ఇన్చార్జిలుగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఆరు నెలలు పొడిగింపు..
చేనేత, జౌళి సహకార సంఘాల సొసైటీలకు ఆరు నెలలు గడువును పొడిగిస్తూ సర్కారు జీవో విడుదల చేసింది. ఫిబ్రవరి 9, 2022 వరకు గడువు పొడిగించింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని 19 చేనేత, జౌళిశాఖ సంఘాల పాలక వర్గాలు పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగనున్నాయి. చేనేత సంఘాలను నిరంతరం పర్యవేక్షణ నిర్వహించడంతోపాటు సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకుంటాం. కార్మికులకు ప్రభుత్వం నుంచి అమలు చేస్తున్న పథకాలను చేరువ చేస్తాం.