ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి
ఖానాపూర్లో టీఆర్ఎస్ పార్టీలో చేరికలు
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 11: టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మండలంలోని ఖానాపూర్ గ్రామంలో శుక్రవారం బొడ్రాయి పండుగను పురస్కరించుకుని గ్రామ దేవత కోటమైసమ్మ అమ్మవారికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఖానాపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కండువాలను వేసి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కొంగళి జంగయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, నాయకులు నాగిరెడ్డి, రామ్మోహన్, అభిమన్యురెడ్డి పాల్గొన్నారు.