అదుపుతప్పి బ్రిడ్జి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడిన కారు
అక్కడికక్కడే ముగ్గురు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
కల్వకుర్తి మండలం మార్చాల వద్ద ఘటన
స్నేహితుడి వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం
కల్వకుర్తి రూరల్, ఫిబ్రవరి 18 :దోస్త్ పెండ్లిలో ఎంజాయ్ చేసిన వారి ఆనందం కొద్ది గంటల్లోనే ఆవిరైపోయింది. వివాహం తర్వాత తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాద రూపంలో వారిని మృత్యువు కబళించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బ్రిడ్జి బారికేడ్ను ఢీకొని బోల్తాకొట్టింది. దీంతో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడగా హైదరాబాద్లోని దవాఖానకు తరలించారు. ఈ ఘటన కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలో
చోటు చేసుకున్నది.
స్నేహితుడి వి వాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా.. కారు అదు పు తప్పి బ్రిడ్జి బారికేడ్ను ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గా యాలైన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మం డలం మార్చాల వద్ద చోటు చేసుకున్నది. కల్వకుర్తి ఇన్చార్జి సీఐ రామకృష్ణ కథనం మేరకు.. నల్లగొండ జిల్లా కొండ మల్లేపల్లికి చెందిన అరవింద్(23), పీఏ పల్లి మండలం వద్దిపట్ల గ్రామానికి చెందిన శిరీష (20), మహబూబాబాద్ జిల్లా గొల్లచర్ల గ్రామానికి చెందిన కిరణ్మయి(22), మరో యువతి మిర్యాలగూ డ మండలం గూడూరు గ్రామానికి చెందిన రేణుక హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో వివిధ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. గురువారం సాయం త్రం వెల్దండ మండల కేంద్రంలో వారి స్నేహితుడి వివాహ వేడుకకు కారు (టీఎస్ 05 ఈఎం 3380) లో హాజరయ్యారు. మధ్య రాత్రి తర్వాత కల్వకుర్తి- జడ్చర్ల ప్రధాన హైవే మీదుగా తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు. ఈ క్రమంలో కల్వకుర్తి మండలం మార్చాల గ్రామ శివారులోకి రాగానే రోడ్డుపై ఉన్న బ్రిడ్జి వద్ద కారు అతివేగంగా బారికేడ్ను ఢీకొట్టింది. దీంతో కారులోని అరవింద్, శిరీష, కిరణ్మయి అక్కడికక్కడే మృతి చెందారు. రేణుకకు తీవ్ర గాయాలు కాగా.. అటు వెళ్తున్న డీసీఎం వాహనదారుడు ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించా డు. హుటాహుటిన కల్వకుర్తి ఎస్సై మహేందర్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుల వద్ద సెల్ఫోన్ల నుంచి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాలతోపాటు గాయపడిన రేణుకను కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రేణుకను హైదరాబాద్ దవాఖానకు తరలించారు.
సర్పంచ్ హఠాన్మరణం..
కల్వకుర్తి, ఫిబ్రవరి 18 : మార్చాల సర్పంచ్ మల్లయ్య హఠాన్మరణం చెందారు. గ్రా మస్తుల కథనం మేరకు.. మా ర్చాల వద్ద జరిగిన రోడ్డు ప్ర మాదస్థలికి సర్పంచ్ వెళ్లాడు. ప్రమాదం జరిగిన తీరును చూసి కలత చెందాడు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో మృతదేహాలను మార్చూరీకి తరలించాడు. ఇంటికి వెళ్లి స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లి అక్కడే కుప్పకూలి చనిపోయాడు. అప్పటివరకు సేవలందించిన సర్పంచ్ హఠాత్తుగా మృతి చెందడం గ్రామస్తులు నమ్మలేకపోతున్నారు.