అదనపు కలెక్టర్ సీతారామారావు
మన్యకొండ బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 11: జిల్లా కేంద్రానికి సమీపంలోని తెలంగాణ తిరుపతి మన్యకొండ లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుందామని అదనపు కలెక్టర్ సీతారామారావు పేర్కొన్నారు. శుక్రవారం స్వామివారి దర్శించుకున్న అనంతరం అలివేలు మంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచన మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టాయిలెట్స్‌ను పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ సీతారామారావును ఆలయ సిబ్బంది శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మధుసూదన్, ఎంపీపీ సుధశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, శ్రీనివాస్‌రావు, తదితరులు ఉన్నారు.