తొందరలోనే టెండర్లు..పనులు ప్రారంభమవుతాయి
జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి
రైల్వేగేటు సమస్య పరిష్కారంపై పరిశీలించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 13 : జడ్చర్లలోని రైల్వేగేటు వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి మంజూరైందని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. త్వరలో పనులకు టెండర్లను పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. జడ్చర్లలో రైల్వేగేటును, గౌడ ఫంక్షన్ హాల్ వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వే డబ్లింగ్ పనుల నేపథ్యంలో గేటు మూతబడటంతో పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారని, గౌడ ఫంక్షన్ హాల్ వద్ద బ్రిడ్జి కింది నుంచి వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని రైల్వే, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు మూతబడిన రైల్వేగేటును తెరవాలని డీఆర్ఎంను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ కమిషనర్ సునీత, సీఐ రమేశ్‌బాబు, కౌన్సిలర్లు ఉమాశంకర్‌గౌడ్, నందకిషోర్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, వంగూర్ హరిత, రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘపతిరెడ్డి, నాయకులు రామ్మోహన్, శ్యాం, నర్సింహయాదవ్, కావలి నర్సింహులు, రవిగౌడ్, నసీర్, నాగిరెడ్డి పాల్గొన్నారు.