రూ.12 కోట్లతో ఇండోర్ స్టేడియం
క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్‌లో బాడీ బిల్డింగ్ పోటీలు ప్రారంభం
మహబూబ్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 12 : క్రీడాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు అమెచ్యూర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో నిర్వహించిన మిస్టర్ మహబూబ్‌నగర్ బాడీ బిల్డింగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు అన్ని విభాగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలో రూ.12 కోట్లతో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మైదానంలో రూ.12 లక్షలతో జిమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడే మరో మోడ్రన్ జిమ్ ఏర్పాటు చేసి పేద క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మహబూబ్‌నగర్‌లో బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 55, 60, 70, 80, 90 పైన కేజీలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. ఓవరాల్ చాంపియన్, బెస్ట్ ఫిజిక్, బెస్ట్ పోజింగ్ క్రీడాకారులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో బాడీ బిల్డింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సలీం, ట్రెజరర్ సీబబ్అజీమ్, అల్తాఫ్, నజ్ముద్దీన్, ఓయూ కోచ్ మహ్మద్‌నజీర్, జిల్లా కార్యదర్శి అబ్దుల్జ్రాక్, ఉపాధ్యక్షుడు కిశోర్, మహమూద్, జాయింట్ సెక్రటరీ ఫరీద్, సభ్యుడు సల్మాన్ షరీఫ్, నాయకులు మహమూద్అలీసనా, షేక్ఉమర్ తదితరులు పాల్గొన్నారు.