మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ వెంకట్రావు, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మూడు నెలల్లో కళాభారతి, ఆరు నెలల్లో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు పూర్తి కావాలన్నారు. మోడల్ మార్కెట్లా నిర్మాణం జరగాలన్నారు. వడివడిగా చౌరస్తాల సుందరీకరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. అంతకుముందు కొత్తగంజ్ సమీపంలోని ఈద్గాలో రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాట్లను మంత్రి పర్యవేక్షించారు.
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 29 : జిల్లా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వే గం పెంచాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ వెంకట్రావు, అధికారులతో సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళాభార తి పనులను మూడు నెలల్లో, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లను ఆరు నెలల్లో పూర్తి చే యాలని ఆదేశించారు. బస్టాండ్‌ను త్వర గా గుర్తించేలా ఆర్చి నిర్మించాలన్నారు. బస్టాండ్ ఎదుట ఆటోబేతోపాటు మోడ ల్ లైటింగ్‌తో అద్భుతంగా తీర్చిదిద్దాలన్నారు. టీడీ గుట్టలో నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల శ్మ శానవాటిక ప్రహరీలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. పట్టణంలోని ఏడు కూడళ్లలో క్లాక్‌టవర్, తెలంగాణ చౌరస్తా పనులు పూర్తయ్యాయని, ఆర్అండ్బీ చౌరస్తా పనులు ప్రారంభమయ్యాయన్నారు. కలెక్టరేట్ నూతన భవనంలోకి మారిన తరువాత.. పాత బిల్డింగ్ స్థానంలో సూపర్‌స్పెషాలిటీ ద వాఖానను ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సమావేశంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు తేజస్‌నందలాల్‌పవార్, సీతారామారా వు, అధికారులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 29 : జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొత్తగంజ్ సమీపంలో ఉన్న ర హెమానియా ఈద్గాను సందర్శించి ఏ ర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భం గా మంత్రి మీడియాతో మాట్లాడారు. పాలమూరులో హిందూ ముస్లింలు కలిసి మెలిసి పండుగలు నిర్వహించుకు నే సంస్కృతి ఉన్నదన్నారు. అయ్యప్ప భక్తులకు మైనార్టీలు భోజనం, పండ్లు పంపిణీ చేస్తారని, రంజాన్ మాసంలో హిందువులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చే స్తుంటారన్నారు. కార్యక్రమంలో ము న్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, ముడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిలర్ నరసింహులు, మై నార్టీ నాయకులు మహ్మద్జాకీ, రఫీక్పటేల్, జబ్బార్, ఖాజాపాషా, ప్రశాంత్ త దితరులు పాల్గొన్నారు.