మహబూబ్‌నగ ర్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణ యం తీసుకోవాలని సుప్రీం కోర్టు.. స్పీకర్‌కు సూచించడంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. అసలు వారు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో తెలియని ఆయోమయ పరిస్థితి నెలకొన్నది. దీంతో వారి పరిస్థితి ‘రెంటికి చెడ్డ రేవడిలా’ తయారైంది. 2023లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గద్వాల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా సరిత పోటీ చేశారు. కొద్ది ఓట్ల తేడాతో సరిత ఓడిపోయింది.
ఇక్కడి రాజకీయ పరిస్థితుల కారణంగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. దీంతో నాటి నుంచి కాంగ్రెస్ అ ధిష్టానం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి ప్రియారిటీ ఇస్తూ వచ్చింది. దీంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే, సరి త వర్గీయుల మధ్య వివాదం రగిలింది. పచ్చగడ్డి వేస్తే భ గ్గుమనేలా పరిస్థితి తయారైంది. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ఇక్కడ ప్రారంభించిన ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకు ప్రియారిటీ ఇవ్వడం సరిత వర్గానికి రుచించడం లే దు.
దీంతో గద్వాల కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయి ంది. ఒక వర్గం ఎమ్మెల్యే వర్గం.. మరోవర్గం సరిత వర్గంగా తయారైంది. ఇక్కడ పార్టీ సమావేశాలు ఇరు వర్గాలు ఎవరికి వారే నిర్వహించుకుంటున్నారు. పార్టీ పరిశీలకులు వచ్చినా.. ఇరు వర్గాలు వేర్వేరుగా ఏర్పాటు చేసిన సమావేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీంతో ఇక్కడి ఎ మ్మెల్యే, సరిత వర్గాల సమస్య కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
గత నెలలో సరిత వర్గం ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వర్గానికి బీఫామ్స్ ఇవ్వకుంటే గాంధీభవన్ వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు గద్వాలలో నిజమైనా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని, న్యాయం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సరిత వర్గీయు లు ఫి ర్యాదు చేశారు. గద్వాల కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే, సరిత వర్గం నువ్వా..నేనా అన్న పోటాపోటీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇటువంటి తరుణంలో సుప్రీం కోర్టు తీ ర్పుతో సరిత వర్గంలో ఆనందం నెలకొన్నట్లు తెలుస్తున్నది.
టికెట్ మాకే అంటున్న సరిత వర్గీయులు
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సుప్రీం కోర్టు సూచించడంతో ఉపఎన్నికలు ఖాయమనే భావన సర్వత్రా వ్యక్తమవుతున్నది. అయితే ఉపఎన్నిక వస్తే ఎన్నికల్లో ఓడిపోయిన సరితకు అధిష్టానం టికెట్ ఇస్తుందని ఆమె వర్గీయులు గట్టిగా నమ్ముతున్నారు. ఉప ఎన్నిక వస్తే తమకే టికెట్ ఇవ్వాలని సరిత కూడా కాంగ్రెస్ పెద్దలను కలుస్తూ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఓడిపోయినా సరితకు గద్వాల కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటని ఆయన అనుచరులు గుసగుసలాడుతున్నట్లు తెలిసింది. దీంతో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపినా ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచర వర్గం డైలమాలో ఉన్నట్లు సమాచారం.
బీఆర్ఎస్లో మూసుకపోయిన ద్వారాలు
బీఆర్ఎస్లో గద్వాల ఎమ్మెల్యేకు ద్వారాలు మూసుకుపోయినట్లు తెలుస్తున్నది. గత ఎన్నికల్లో పార్టీ గుర్తుపై గెలిచి, కాంగ్రెస్‌కు మద్దతు తెలపడంపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. గద్వాల ఎమ్మెల్యే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి నేను పార్టీ మారలేదని, బీఆర్ఎస్లో ఉన్నానని చెబుతూనే కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనడం సరిత వర్గానికి రుచించడం లేదు. పార్టీ మారలేదు.. అంటాడు కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటాడు.. పరిశీలకులు వస్తే వారి ద్వారా సమావేశాలు నిర్వహిస్తాడు? కానీ కాంగ్రెస్‌లో చేరలేదని చెబుతుండడంతో ఆయన వెంట ఉండే కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.
ఇప్పటికి ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియని పరిస్థితి నెలకొందని గద్వాల ప్రజలు చర్చించుకుంటున్నారు. గద్వాల ఎమ్మెల్యేకు బీఆర్ఎస్లో దారులు మూసుక పో యినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఉపఎన్నికవస్తే ఎ మ్మెల్యేకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తారనేది అనుమానంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యేకు ఇటు బీఆర్ఎస్లో టికెట్ రాక.. అటు కాంగ్రెస్‌లో సరితతో పోటీ పడుతూ టికె ట్ తెచ్చుకుంటాడనేది ప్రశ్నే. దీంతో డైలమాలో ఎమ్మెల్యేతోపాటు ఆయన వర్గీయు లు ఉన్నారు.
ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది చర్చ..
ఒకవేళ అనర్హత వేటు పడి గద్వాల ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే ఎమ్మె ల్యే బండ్ల ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారంటూ గద్వాల నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ టాపిక్ హాట్ టాపిక్‌గా రెండ్రోజులుగా నియోజకవర్గంలో చక్కర్లు కొడుతుంది. ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారా? లేక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చే ఛాన్స్లేదని ఇక్కడి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.
బీఆర్ఎస్ టికెట్ రాకపోత కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా ? అంటే గతంలో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి ఓడిపోయినా సరిత ఒకవేళ ఉప ఎన్నిక వస్తే నాకే టికెట్ కేటాయించాలని అధిష్టానంపై ఇప్పటి నుంచే ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఎమ్మెల్యే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే తెలియాలంటే.. గద్వాల రాజకీయ గందరగోళానికి తెరపడాలంటే మరో మూడు మాసాలు ఆగాల్సిందే.