కోడ్‌తో ‘గృహజ్యోతి’కి బ్రేక్!
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉచి త విద్యుత్ పథకానికి బ్రేక్ పడింది. ఇందుకు ఎన్నికల కోడ్ కంటే ముం దుగా ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టకపోవడంతో సీఎం సొంత జిల్లాలో ఉచిత విద్యుత్ అమలు కోడ్ ముగిసే వరకు ఆగనున్నది.
- ఎన్నికల సమయమంటూ అమలు చేయని వైనం
- సీఎం సొంత జిల్లాలో ఉచిత విద్యుత్‌కు మంగళం
మహబూబ్‌నగర్, మార్చి 4 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉచి త విద్యుత్ పథకానికి బ్రేక్ పడింది. ఇందుకు ఎన్నికల కోడ్ కంటే ముం దుగా ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టకపోవడంతో సీఎం సొంత జిల్లాలో ఉచిత విద్యుత్ అమలు కోడ్ ముగిసే వరకు ఆగనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 200యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని కాంగ్రెస్ ప్రభు త్వం చెప్పిన విషయం విధితమే.
స్థానిక సంస్థల శాసన మండలి ఉపఎన్నికల కోడ్ రావడంతో మార్చిలో వినియోగదారులు బిల్లులు చెల్లించాల్సిందే. ఉచిత విద్యుత్ ఈ నెలలో వస్తుందని అనుకున్న విద్యుత్ వినియోగదారులకు చేదు అనుభవం మిగలనున్నది. ఎన్నికల కోడ్ ఏప్రిల్ 4వ తేదీన ముగియనున్నది. అయితే ఈ కోడ్ అమలులో ఉండగానే పార్లమెంట్ ఎన్నికల కోడ్ కూడా వస్తుందని, ఇక ఈ పథకం అమలు కావాలంటే జూన్ వరకు ఆగాల్సిందేనని పలువురు చర్చికుంటున్నారు.
ముందుగానే కాంగ్రెస్ సర్కారు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసి ఉంటే ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెలలోనే ఉచిత విద్యుత్ అమలై ఉండేదని వినియోగదారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఉచిత విద్యుత్ అమలుకు కోడ్ ముగిసే వరకు వినియోగదారులు వేచి చూడాల్సిందే.
కోడ్ ముగిసిన తర్వాతే అమలు..
ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తాం. ప్ర స్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉచిత విద్యుత్ పథకం అమలు కాదు. అయితే విద్యుత్ వినియోగదారుల ఇప్పుడు చెల్లించిన డబ్బులకు సరిపో నూ ఉచిత విద్యుత్‌ను కోడ్ ముగిసిన తరువాత అందిస్తాం. ఈ విషయం లో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– వెంకటరమేశ్, విద్యుత్ శాఖ ఎస్ఈ, మహబూబ్‌నగర్ జిల్లా
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

