మహబూబ్నగర్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వం పట్టణాలు పంచాయతీల మధ్య చిచ్చు పెడుతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతమున్న మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని (ముడా)కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. తాజాగా ముడా పరిధిని పెంచుతూ కొత్తగా మరో నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథా రిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇంతవరకు బాగానే ఉంది కానీ, జిల్లా కేంద్రాలకు సమీపంలో ఉన్న తండాలు పంచాయతీలపై దీని ఎఫెక్ట్ పడుతుండడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. పేరుకే శివారు గ్రామాలు అయినప్పటికీ రియల్ ఎస్టేట్ రంగం పెద్దగా అభివృద్ధి చెందలేదు. పైగా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కలిపితే ఆస్తి పన్ను ఇతర ట్యాక్సులు భారీగా కట్టాల్సి వస్తుందని జనం జంకుతున్నారు.
అంతేకాకుండా కొత్తగా ఏర్పాటైన అనేక తం డాలు కూడా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో విలీనమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాల్లో అంతంత మాత్రమే ఉన్న ప్రజల జీవన ప్రమాణాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనున్నది. ఇంటి నిర్మాణానికి పర్మిషన్ తీసుకోవాలన్నా భారీగా పన్ను చెల్లించా ల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆస్తి పన్ను కూడా గణనీయం గా పెరిగే అవకాశం ఉంది. పంచాయతీల్లో సంపాదించింది అంతా తిండికే సరిపోతున్న తరుణంలో కొత్తగా పన్నులు ఎ క్కడి నుంచి కడతామని జనం ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీల వరకే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పా టు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. సమీప గ్రామాలను వీటిలో చేర్చడం వల్ల అన్ని రకాలుగా నష్టపోవాల్సి ఉంటుందని గ్రామీణులు వాపోతున్నారు. అంతేకాకుండా కొత్తగా ఏర్పాటైన తండాలు పంచాయతీలుగా మారిన ఐదేండ్లకే వార్డులకు పరిమితమయ్యే పరిస్థితి దాపురించిందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కొత్తగా నాలుగు ఏర్పాటు
రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేస్తున్నది. ఈ క్రమంలో మున్సిపాలిటీల పరిధులను భారీగా పెంచుతున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ మున్సిపాలిటీలను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలుగా ఏ ర్పాటు చేస్తోంది. ఫలితంగా ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలను కాదని సమీప గ్రామాలు, తండాలను కూడా ఈ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కలిపేందుకు అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా పదుల సంఖ్యలో తండాలు గ్రామాలను ఒక్క కలం పోటుతో మున్సిపాలిటీల్లో విలీనం చేసే అవకాశాలు లేకపోలే దు. ఇదే గనుక జరిగితే తండాలు పంచాయతీలు వార్డులుగా మారిపోతాయి.
స్వయం ప్రతిపత్తిని సైతం కోల్పోతారు. దీనివల్ల ఏటా కేంద్రం రాష్ట్రం కేటాయించే నిధులు నిలిచిపోవడమే కాకుండా ఈ పంచాయతీలు అభివృద్ధి కావాలంటే మున్సిపాలిటీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి ఉంటుంది. తక్కువ ధరకే ప్లాట్ల కొనుగోలు జరుగుతున్న దీని పరిధిలోకి రావడం వల్ల ఒకేసారి వాల్యూవేషన్ పెరిగి ఇటు రిజిస్ట్రేషన్ చార్జీలు అటు ప్లాట్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. పాలనా పరంగా కూడా ఇకమీదట ఈ తండాలు పంచాయతీల్లో ఇల్లు కట్టుకోవాలన్నా మున్సిపాలిటీ లేదా అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనుమతి పొందాల్సి ఉంటుంది. అలాగే తం డాలో ఏ చిన్న పనిచేయాలన్నా మున్సిపాలిటీ నిధుల కోసం దేబిరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రకంగా తండాలు ఇలా నిధులను తమ స్వపరిపాలన హక్కును కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం అవుతుంది.
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలపై కసరత్తు
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో కొత్తగా నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయా కలెక్టర్లు సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులతో సంప్రదించి సాధ్యాసాధ్యాలపై కసరత్తు ప్రారంభించారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్వరూపంపై కిందిస్థాయి సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. కాగా తమకు అనుకూలంగా అర్బన్ డెవలప్మెంట్ ఆచార్యులు ఏ ర్పాటు కోసం జిల్లాలోని మంత్రి ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండేలా వీటిని ఏర్పా టు చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఇప్పుడు న్న పరిధి కాకుండా మరింత పెంచేలా చూస్తున్నారు. ప్రస్తుతం భూత్పూ ర్, జడ్చర్ల మున్సిపాలిటీలు ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో ఉన్నాయి. మరింత పెరిగితే ఇటు హన్వాడ అటు రాజాపూర్ మరోవైపు మూసాపేట, మన్యంకొండ వరకు పరిధి పెంచే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. పది నుంచి 15 పంచాయతీల వరకు విస్తరించే అవకాశం ఉంది. అభివృద్ధి మాటున పంచాయతీల హక్కులు కాలరాసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలున్నాయని విమర్శలు తలెత్తుతున్నాయి.
ప్రశ్నార్థకంగా తండాల పరిస్థితి..
సుదీర్ఘకాలంగా గిరిజనులు డిమాండ్ చేస్తున్న ‘మా తండాలో మా రాజ్యం’ డిమాండ్ తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ నెరవేర్చారు. వేలాది తండాలన్నీ గ్రామ పంచాయతీలుగా మార్చారు. ఇతరుల దయాదాక్షిణ్యాలతో ప్రమేయం లేకుండా గిరిజనులే పాలకులయ్యారు. తమ పంచాయతీలను తామే తీర్చిదిద్దుకున్నారు. పంచాయతీలుగా మారిన ఈ తండాలన్నింటికీ కేంద్ర రాష్ర్టాలు జనాభా ఆధారంగా నేరుగా నిధులొచ్చాయి. రాజకీయంగా అనేక మంది గిరిజనులు నాయకులుగా ఎదిగే అవకాశం లభించింది. పంచాయతీలుగా మారి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న తండాలన్నీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో విలీనమైతే గిరిజనుల అస్తిత్వంపై దెబ్బకొట్టినట్లేనని గిరిజన నేతలు అభిప్రాయపడుతున్నారు. నిధుల కోసం అభివృద్ధి కోసం మున్సిపాలిటీ చైర్మన్న్లపై ఆధారపడాల్సి వస్తుందని.. తమ చేతుల్లో ఉన్న రాజ్యాధికారం మళ్లీ లాక్కున్నట్లే అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.