మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు 27 : కులమతాలకు అతీతంగా అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తామని ఎక్సైజ్, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌ డ్ అన్నారు. ఆదివారం క్రిస్టియన్‌పల్లిలో ని డబుల్బెడ్రూం కాలనీ వద్ద 500 గజాల్లో రూ.10లక్షల వ్యయంతో చేపట్టిన స్వరలహరి కల్చరర్ అకాడమీ భవన నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన కళాకారుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కళాభారతిని ఆధునికంగా నిర్మిస్తున్నామని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపారు. స్వరలహరి వారు 30ఏండ్లుగా భక్తిపాటలు, భజనలు, ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని గుర్తుచేశారు. 57ఏండ్లు పైబడిన వృద్ధ కళాకారులకు ఐడీ కార్డులను అందిస్తామని, అర్హులైన వారికి పింఛన్ ఇస్తామన్నారు. అంతకుముందు కళాకారులు మంత్రికి సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన నిర్వహించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, స్వరలహరి కల్చరల్ అకాడమీ అధ్యక్షుడు భాగన్నగౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, కౌన్సిలర్ రాణి, నాయకులు సమద్‌ఖాన్, కుమార్, రాజు, రాధికసాగర్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్‌పల్లి డబుల్బెడ్రూం కాలనీ సమీపంలో ఆదివారం 500 గజాల స్థలంలో రూ.20లక్షలతో చేపట్టిన భవసార్ క్షత్రీయ సమాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, పనిచేసే వారికి అండగా ఉండాలన్నారు. అంబాభవానీ ఆలయం వద్ద ఉన్న భూ సమస్య పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, కౌన్సిలర్ రాణి, భవసార్ క్షత్రీయ సమాజ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సురేశ్పరాంకర్, రాజేంద్రపవార్, కోశాధికారి విజయపరాంకర్, నాయకుడు రాజు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ అర్బన్, ఆగస్టు 27 : కాశికాపడి కులస్తులు కష్టాన్ని నమ్ముకొని బతుకుతారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ కాశికాపడి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కాశికాపడి ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పై మహిళలు పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ.. కాశికాపడి సం ఘం భవన పునర్నిర్మాణం కోసం రూ. 50లక్షలు, అలాగే మహిళా సంఘం నూ తన భవన నిర్మాణానికి మరో రూ.20లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కాశికాపడి కులస్తులకు డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేశామని, అవసరమైతే మరిన్ని మంజూరు చేస్తామన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సెప్టెంబర్ 2న జిల్లా కేంద్రంలోని శిల్పరామంలో మెగా జాబ్‌మేళా నిర్వహించి అదేరోజు ఉత్తర్వులు అందజేస్తామని తెలిపారు. మాయమాటలతో వచ్చేవారిని నమ్మొద్దని, తగిన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ చిన్న, కాశికాపడి సంఘం అధ్యక్షుడు సుద్దాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు శ్రద్ధ్దానంద్, కా ర్యదర్శులు అనిల్‌కుమార్, శరత్, చంద న్, నందు, రాము, విజయ్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, ఆగస్టు 27 : అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జేజేఆర్ గార్డెన్లో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసించి చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన 30 మంది గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను మంత్రి అందజేశారు. అంతకుముందు సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఉన్నత చదువులు చదివే వారికి అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ చక్రవర్తిగౌడ్, గౌడ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ర వీందర్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు సాయిలుగౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, పీఆర్టీయూ నాయకుడు నారాయణగౌడ్, టీపీయూఎస్ నాయకుడు శ్రీనివాస్‌గౌడ్, శ్రీధర్‌గౌడ్, కౌన్సిలర్ యాదగిరిగౌడ్ తదితరులు ఉన్నారు.
పాలమూరు, ఆగస్టు 27 : కర్ణాటక, మహారాష్ట్ర భక్తులతోపాటు లింగాయత్‌లకు ఎంతో పవిత్రమైన అక్కమహాదేవి ఆలయం పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. త్వరలో పర్యటించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బోయపల్లిరోడ్లో బసవేశ్వర భవన్లో ఏర్పాటు చేసిన బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్క మహాదేవి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కృష్ణానదికి ఆనుకొని దట్టమైన నల్లమల అటవీ ప్రాం తంలో శ్రీశైలం సమీపంలో ఉన్న అక్కమహాదేవి గుహల వద్ద మెట్లు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే పర్యాటకుల కోసం బో ట్ సౌకర్యం కల్పిస్తున్నామని వివరించా రు.
ట్యాంక్‌బండ్‌పై బసవేశ్వరుడి విగ్ర హం ఏర్పాటు చేసినట్లు పే ర్కొన్నారు. హైదరాబాద్ కోకాపేట్లో రూ.200కోట్ల విలువైన భూమి, నిధులు ఇచ్చి బసవ భవన్ నిర్మించామన్నారు. వీరశైవ లింగాయత్‌లను ఓబీసీలో చేర్చేందుకు బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు శుభభ్ర త, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షు డు గో పాల్‌యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ శివకుమార్, జేపీఎన్సీ చైర్మన్ రవికుమార్, కౌన్సిలర్లు నర్సింహులు, మోతీలాల్, శివుడు, వీరన్న, శంకరలింగం, రాజసింహుడు, వజ్రలింగం, సిద్ధ్దరామప్ప, విగ్రహ దాత నాగభూషణం, ఏగూరు ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.