రైల్వే రంగంలో భారీ సంస్కరణలు
మౌలిక సదుపాయాల కల్పనలో భారతీయ రైల్వే భారీ పరివర్తన దిశగా పురోగమిస్తున్నదని, గడిచిన పదేండ్లలో రైల్వేరంగం వేగవంతంగా పురోగతి సాధించిందని పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అమృ త్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా జడ్చర్ల రైల్వేస్టేషన్ ఆధునీకరణకు రూ.10.94 కోట్లు మంజూరయ్యాయి.
- మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి
- జడ్చర్ల రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులకు శంకుస్థాపన
జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 26 : మౌలిక సదుపాయాల కల్పనలో భారతీయ రైల్వే భారీ పరివర్తన దిశగా పురోగమిస్తున్నదని, గడిచిన పదేండ్లలో రైల్వేరంగం వేగవంతంగా పురోగతి సాధించిందని పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అమృ త్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా జడ్చర్ల రైల్వేస్టేషన్ ఆధునీకరణకు రూ.10.94 కోట్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టేషన్ ఆధునీకరణ పనులను పీఎం మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం ఎంపీ మాట్లాడారు. రైల్వేరంగంలో ప్రధాని భారీ సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం గత పదేండ్లలో రాష్ర్టానికి రై ల్వేబడ్జెట్‌లో దాదాపు రూ.5,071 కోట్లు కేటాయించిందన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల కు ఉపయోగకరమైన సేవలు అందించాలని సూ చించారు. ప్రజలందరికీ మంచి చేస్తున్న నరేంద్రమోదీకి ధన్యావాదాలు తెలియజేశారు. అనంతరం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, వైస్‌చైర్మన్ యాదయ్య, మాజీ మంత్రి డీకే అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్‌చైర్‌పర్సన్ సారిక, రైల్వే అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
అందుబాటులోకి ‘అండర్‌పాస్’
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 26 : అం డర్పాస్ రైల్వే బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రయాణ భారం తగ్గిందని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అప్పన్నపల్లి వద్ద నిర్మించిన అండర్‌పాస్ రైల్వే బ్రిడ్జిని సోమవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి, కౌన్సిలర్ రామాంజనేయులు, హనీఫ్ అ హ్మద్, సాదుల్లా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

