ఊరుకొండ : ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా ఊరుకొండ మండల పరిధిలోని గుణగుంట్లపల్లి, బాల్యలోక తండా, ఊరుకొండ, తిమ్మనపల్లి మాజీ సర్పంచులను ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం ఊరుకొండ పీఎస్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ఇంతవరకు ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత పెండింగ్ బిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి పనులు చేయించిన తమకు రోజురోజుకు వడ్డీలు భారమవుతున్నాయని చెప్పారు. వడ్డీలకు వడ్డీలు కడుతూ అప్పులపాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మాజీ సర్పంచుల సంఘం పిలుపుమేరకు ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లేందుకు మాజీ సర్పంచులు సిద్ధమయ్యారు. కానీ వారు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేశారు. అరెస్టయిన వారిలో మాజీ సర్పంచ్లు ఆంజనేయులు, రాజయ్య, శ్రీను నాయక్, సుదర్శన్ ఉన్నారు.