మహబూబ్‌నగర్ అర్బన్, ఆగస్టు 31: పేదల విషయంలో రాజకీయాలు పక్కనపెట్టి మానవతా దృక్పథంతో ఆలోచించాలని మున్సిపల్ మాజీ చైర్మన్ కొరమోని నర్సిహుంలు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయం లో క్రిస్టియన్‌పల్లి ఆదర్శకాలనీలో సర్వే నెంబర్ 523లో ఉన్న 70 ఇండ్లకుపైగా పట్టాలు ఇచ్చారని, ఇపుడు అదే ప్రభు త్వం ఎలాంటి సమాచారం లేకుండా ఇం డ్లు కూలగొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
దొంగ పట్టాలు అని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు, వెంటనే విచారణ చేయాలని, అవి ఇచ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి సో దరుడిపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆ రోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇప్పటికై న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి స్పం దించి కూలగొట్టిన చోటనే ఇండ్ల నిర్మా ణం పూర్తి చేసి, బాధితులకు అందించాలన్నారు. అనంతరం బీఆర్ఎస్ పట్టణ అ ధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ బీసీ నా యకులను హేళన చేసేలా న్యాయవాది వినోద్‌కుమార్ మాట్లాడటం సరైందికాదన్నారు.
పేదలను ఆదుకునేందుకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదర్శనగర్ వెళ్లితే వినోద్‌కుమార్ ఆరోపణలు చేస్తావా.. త గిన మూల్యం చెల్లించుకోక తప్పదని హె చ్చరించారు. కౌన్సిలర్ అనంత్‌రెడ్డి మా ట్లాడుతూ దివ్యాంగులను ఆదుకునేందు కు మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన శా యశక్తులా ప్రయత్నాలు చేస్తుంటే కాం గ్రెస్ నాయకులు ఇంట్లో కూర్చుని విమర్శలు చేయడం తగదన్నారు. మున్సిపల్ చైర్మన్ నేటి వరకు నిర్వాసితులను ఎం దుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించినందుకే బయ టికి పంపారని అన్నారు. ఇప్పటికీ అదే పద్ధతిన వ్యవహిస్తున్నాడని, అధికారం తె లియని వ్యక్తి శ్రీనివాస్‌గౌడ్‌ను విమర్శించడం తగదని అన్నారు. మరో బీఆర్ఎస్ నేత జంబులయ్య మాట్లాడుతూ అబద్ధ పు ప్రచారం చేస్తున్న వినోద్‌కుమార్‌కు సి గ్గు, శరం ఉంటే నిరూపించాలన్నారు. కా ర్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చై ర్మన్ గణేశ్, బీఆర్ఎస్ నాయకులు నవకాంత్, సుధాకర్, గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గ్గొన్నారు.