బిజినేపల్లి : నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ ( BRS ) నాయకులు తిరుపతయ్య కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy ) బుధవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇంటిలో చిత్ర పటానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, పులిందర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, బాలస్వామి, గోపి,విష్ణువర్ధన్ , రెడ్డి, గఫూర్, కుర్మయ్య,శివ , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.