నారాయణపేట, జూలై 16 : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవడం బాధ్యత అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం శేరి వెంకటాపూర్ గ్రామం లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటరు ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారాలను నింపి బీఎల్వోకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్యూమరేషన్ దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా బీఎల్వోలు ఓటర్లకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు.