E20 Petrol: ఈ20 పెట్రోల్ అమ్మకండి.. పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం
E20 Petrol: దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ వాడకాన్ని నిషేధించాలని కోరుతూ ఇవాళ పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాన్ని పంజాబ్ అసెంబ్లీ వ్యతిరేకించింది. అమెరికాతో జరిగిన వాణిజ్య డీల్ కారణంగా దేశంలో ఇథనాల్ పెట్రోల్ అమ్ముతున్నట్లు సీఎం భగవంత్‌మాన్ ఆరోపించారు.
చండీఘడ్: దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్(E20 petrol) అమ్మకాలపై ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాలు దెబ్బతింటున్నట్లు కొన్ని చోట్ల ఫిర్యాదులు అందాయి. అయితే దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ వాడకాన్ని నిషేధించాలని కోరుతూ ఇవాళ పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాన్ని పంజాబ్ అసెంబ్లీ వ్యతిరేకించింది. ఇథనాల్ ఫ్రీ పెట్రోల్‌తో పాటు ఈ20 పెట్రోల్ ఎంపిక చేసుకునే అవకాశం వినియోగదారుడికి ఇవ్వాలని సభలో డిమాండ్ చేశారు. ఈ20 పెట్రోల్‌కు తగినట్లు డిజైన్ లేని వాహనాల్లో దాన్ని వాడడం వల్ల సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఈ20 వాడకం వల్ల వాహనాల్లో మైలేజీ తగ్గుతుంది కాబట్టి, ఆ సామర్థ్యానికి తగినట్లు ఈ20 పెట్రోల్ రిటేల్ ధరను తగ్గించాలని తీర్మానంలో కోరారు. ఆటోమొబైల్ ఇంజినీర్లు, పెట్రోలియం నిపుణులు, పర్యావరణ శాస్త్రవేత్తలు, వినియోగదారుల సంఘాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఓ వ్యక్తిగత కమిటీని ఏర్పాటు చేసి ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై సమగ్రమైన స్టడీ చేయాలని తీర్మానంలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
సీఎం భగవంత్‌మాన్ సింగ్ సభలో మాట్లాడుతూ సుమారు 45వేల వాహనాలపై ఈ20 ప్రభావం గురించి స్టడీ చేశారని, ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడడం వల్ల వాహనాల్లో మైలీజీ తగ్గినట్లు గుర్తించారని, కొన్ని వాహనాలు పాడైనట్లు కూడా ఆయన చెప్పారు. అసలు ఈ20 విషయంలో ప్రధాని మోదీ ఎందుకు పట్టుపట్టారని, ఇదేమీ నితిన్ గడ్కరీ కుమారుడికి లాభం తెచ్చిపెట్టదని, ఎందుకంటే మోదీకి, ఆయనకు మంచి సంబంధాలు లేవని, కేవలం అమెరికా ప్రభుత్వ వత్తిడి వల్లే ఈ20 పెట్రోల్ అమ్మకాలపై కేంద్రం వత్తిడి తెస్తున్నట్లు భగవంత్ మాన్ ఆరోపించారు.
ఇటీవల అమెరికాతో వంద బిలియన్ల డాలర్ల వాణిజ్య ఒప్పందం కుదిరిందని, దానిలో భాగంగా 5 బిలియన్ల లీటర్ల ఇథనాల్ భారత్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని భగవంత్‌మాన్ ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

