తాడూరు, నవంబర్ 25 : రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం రాబంధులా మారిందని నాగర్‌కర్నూ ల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాడూరు మండలంలోని ఇంద్రకల్ సమీపంలో మణికంఠ జిన్నింగ్ మిల్ వద్ద మర్రి వెళ్తుండగా.. రైతులు ఆయన కా రును నిలిపి పత్తి కొనుగోలు చేయడంలేదని వివరించారు.
కష్టపడి పండించిన పంటను అమ్మేందుకు కొద్దిరోజులుగా పడుతున్న బాధలను రైతు లు తెలిపారు. ఈ సందర్భంగా మర్రి మాట్లాడు తూ రైతులు తెచ్చిన పత్తిని వెంటనే అన్లోడ్ చే యాలన్నారు. సీసీఐ అధికారులతో మాట్లాడి కొ ర్రీలు లేకుండా కొనుగోలు చేయాలని సూచించా రు. మద్దతు ధర చెల్లించకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులకు న్యాయం జరిగే వరకు పోరా టం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ వెంటనే స్పందించి సీసీఐ కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
ఓవైపు పండించిన పంటలను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. ఈ సమయంలో విజయోత్సవ సంబురాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, ప దేండ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా కేసీఆర్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులతోపాటు, స బ్బండ వర్గాలు ఇక్కట్లు పడుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే సమీక్ష చేసి రైతులకు న్యా యం చేయాలని డిమాండ్ చేశారు.
రైతులందరి పత్తి పంటను సీసీఐ ద్వారానే కొ నుగోలు చేయాలని సీసీఐ అధికారి దుబేకు మా జీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఫోన్లో సూచించా రు. ఈ సంవత్సరం వర్షాలు అధికంగా పడ్డాయని, చాలామంది రైతులకు సంబంధించిన పత్తి పంటలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. అందువల్ల పత్తి కొంత దెబ్బతిన్నదని.. ఈ విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా సీసీ ఐ ద్వారానే కొనుగోలు చేయాలని కోరారు.
నష్టపోయిన రైతులను నాణ్యత, తేమ పేరుతో మద్ద తు ధర ఇవ్వకుంటే రైతుల కష్టం వృథా అవుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు నష్టం జరిగితే.. వా రు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ఉ న్నారన్నారు. అందువల్ల నాణ్యత, తేమకు సం బంధం లేకుండా అందరి రైతులకు సంబంధించిన పత్తి పంటను సీసీఐ కొనాలని సూచించారు.