అచ్చంపేట, ఆగస్టు 7 : నాగర్‌ర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ క్యాడర్‌ను ఏకతాటిపైకి తీసుకొచ్చి స్థానిక సంస్థలు, రాబోయే అసె ంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండాను ఎగురవేసేందుకు కృషి చేస్తామని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బాలరాజు పార్టీమారి రాజకీయ జీవితాన్ని బొందపెట్టుకున్నారని, స్థాని క సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రి పార్టీ మారాల్సిన అవసరం ఏమోచ్చిందని ప్రశ్నించారు.
గు రువారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ, ఇతర అంశాలపై చర్చించారు. శుక్రవారం అచ్చంపేటలోని బీకే ప్యాలెస్‌లో జరిగే ని యోజకవర్గస్థాయి ముఖ్యుల సమావేశానికి ఉ మ్మడి జిల్లాలోని మాజీ మంత్రులు, మాజీ ఎ మ్మెల్యేలు హాజరవుతున్నారని, సమావేశంలో మం డలాల వారీగా పార్టీ పరిస్థితి గురించి చర్చించనున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ అచ్చంపేటలో రెండు, మూడు రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిస్థితులు అందరికీ తెలిసినవే అన్నారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో అధిష్టానం సూ చ న మేరకు ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించి పార్టీ క్యాడర్‌కు మనోధైర్యం కల్పించాలని తనకు బాధ్యత అప్పగించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పార్టీ మారిన తరుణంలో స్థానిక గులా బీ సైనికులు తామంతా పార్టీ మారమని తెగేసి చెప్పారన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఫోన్ చేసి నియోజకవర్గంలోని ఏ నాయకులు గానీ.. కార్యకర్తలుగానీ.. పార్టీ మారడం లేదని, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారన్నారు. మీరు ఎవరినైనా ఇక్కడికి పంపించండని చెప్పారని, దీన్ని బట్టి చూస్తే పార్టీపై క్యాడర్‌కు ఎంత నిబద్ధత ఉందో అర్థమవుతుందన్నారు. ఎక్కడైనా సరే ముఖ్య నేత పార్టీ మారుతుంటే ఇంతో.. అంతో.. ఆయన వెంట క్యాడర్పోవడం పరిపాటి.. కానీ చరిత్రలో మొదటిసారి పార్టీ మారకుండా ఉన్నారంటే అచ్చంపేట నియోజకవర్గ పార్టీ శ్రేణులకు నిజంగా హాట్సాప్ అన్నారు.
మనం ఎవ్వరో తెలియనప్పుడు పార్టీ బీఫాం ఇచ్చి లీడర్‌గా తయారు చేసి నాయకత్వం బలపర్చి, రాష్ర్టానికి తెలియజేసే విధంగా పార్టీ పునాధులు వేస్తుందన్నారు. కానీ దురదృష్టవశా త్తు పార్టీ అధికారం కోల్పోతే ప్రతిపక్షంలో ఉండలేకపోవడం సరికాదన్నారు. లీడర్ అనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజలతో మమేకం అవుతారన్నారు. అధికారం ఉన్నప్పుడు అభివృద్ధ్ది చూ స్తా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఉండాలని అభిప్రాయపడ్డా రు. ప్రజలు బీఆర్ఎస్కు ప్రతిపక్షపాత్ర ఇచ్చా రు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం మెడలు వంచి పనిచేసే విధ ంగా ఉండాలని సూచించారు.
చిన్నచిన్న ప్రలోభాలు, మనోభావాలకులోనై పార్టీలు మారితే పార్టీ మారినవారు రాజకీయంగా బొందపెట్టుకున్నట్లే అన్నారు. పార్టీకి పదేండ్లు ఎమ్మెల్యే కావడానికి క్యాడర్ పనిచేసిందని చెప్పారు. మరో 15 రోజుల్లో అచ్చంపేటలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో ని యోజకవర్గ స్థాయి సమావేశం ఉంటుందని తెలిపారు. సమావేశంలో సోషల్‌మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ రంగినేని అభిలాష్‌రావు, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షు డు పోకల మనోహర్, మాజీ మున్సిపల్ చైర్మన్లు నర్సింహాగౌ డ్, తులసీరాం, గోపాల్‌రెడ్డి, శ్రీ కాంత్ బీమా, కేటీ తిరుపతయ్య, న రేందర్‌రావు, మాజీ ఎంపీపీ కర్ణాకర్రా వు, పర్వతాలు, బండపల్లి వెంకటయ్య, విండో చైర్మన్లు నర్సయ్యయాదవ్, భూపాల్‌రావు, రవీందర్రావు, శ్రీపతిరావు, గణేశ్‌రావు, రాజేందర్‌రెడ్డి, శ్రీపతిరావు, గోపాల్‌నాయక్, సుదర్శన్‌రావు, రవీందర్‌రె డ్డి, ఎడ్మ వెంకటయ్య, మాజీ సర్పంచ్ శారద తదితరులు పాల్గొన్నారు.