వెల్దండ, డిసెంబర్ 16 : హామీలు అమలు చేయడం లో సీఎం రేవంత్‌రెడ్డి ఫెయిల్యూర్ అయ్యారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. సోమవారం వెల్దండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా జీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలం గడుపుతూ ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీ సక్రమంగా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మో సం చేసిందన్నారు.
పాఠశాలల్లో ఫుడ్ ఫాయిజన్‌తో విద్యార్థులు దవాఖానల పాలవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉన్నారని ఆయ న గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో పూర్తైన ఇండ్లకు కాంగ్రెస్ రంగులు వేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రూ.2లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో మాజీ ఎంపీపీ పుట్టా రాంరెడ్డి, మాజీ సర్పంచ్ శంకర్‌నాయక్, ఉపసర్పంచ్ నిరంజన్, బీఆర్ఎస్ యూత్ అ ధ్యక్షుడు యాదగిరి, లింగం, పోలె అశోక్, శ్రీను, వెంకట య్య, రాజు తదితరులు ఉన్నారు.