కల్వకుర్తి రూరల్, ఆగస్టు 28 : ఎమ్మెల్సీ కవితకు బెయి ల్ మంజూరు కావడంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పోటీలు పడి ఆరోపణలు చేయడం అసత్యం, అర్ధరహితమని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు.
బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే బెయిల్ మంజూరు అయ్యిందని, కోర్టు తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాల్సింది పోయి వి మర్శలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నా రు. ఉన్నత విద్య, రాజకీయంగా సేవలను అందిస్తున్న మ హిళను కావాలనే కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక రాజకీయ కుట్రలో జైలుకు పంపించారని మండిపడ్డారు. ఇదే విషయమై ఈడీ, సీబీఐని సుప్రీంకోర్టు సైతం మందలించిందని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల తీరు ను ప్రజలు చీదరించుకుంటున్నారని ధ్వజమెత్తారు.
అ నంతరం రంగారెడ్డి జిల్లా ఆమనగల్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం హనుమాన్పల్లికి చెందిన కుర్మ అంజయ్య మృ తదేహానికి నివాళుర్పించారు. కల్వకుర్తి మండలం జిల్లెల, మార్చాలలో ఇటీవల మృతిచెందిన బాధిత కు టుంబాలను పరామర్శించి ఆర్థికసాయం అందించారు. ఆయన వెంట పార్టీ మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్, కృష్ణారెడ్డితోపాటు నాయకులు ఉన్నారు.