వెల్దండ, ఆగస్టు 5 : కల్వకుర్తి నియోజకవర్గాన్ని రూ.5వేల కోట్లతో అభివృద్ధి చేశామని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభోత్సవాలు చేసిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో ప్రజలకు జవాబు చెప్పాలని డి మాండ్ చేశారు. ప్రజలు ఏమైనా అభివృద్ధి పనులు వద్దని చెప్పారా? మరి ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 200 రోజులు గడుస్తున్నా.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేదని ఆరోపించారు. ఉచిత బస్సు పేరుతో పల్లెలకు ఆర్టీసీ బస్సులు లేకుండా చేశారని మండిపడ్డారు.
రుణమాఫీ ఒకే విడుతలో చేల్లిస్తామని చెప్పి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. పాడి రైతులకు నాలుగు నెలల బిల్లులు చెల్లించకపోతే ఎలా అని వెంటనే బిల్లులు చెల్లించాలని ప్ర భుత్వాన్ని కోరారు. అనంతరం వెల్దండలో బీఆర్ఎస్ కా ర్యకర్త జంగిలి ప్రసాద్ తల్లి మొగులమ్మ మృతి చెందడం తో బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, యాదగిరి, ఆనంద్, రవికుమార్, శేఖర్, శ్రీనుముదిరాజ్, శ్రీను, అశోక్ ఉన్నారు.