కల్వకుర్తి, ఏప్రిల్ 5 : అధికార దాహం తో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపులేకుండా పోయిందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి జైపాల్‌యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గజ్వేల్‌లో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ క్యాం ప్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడిని మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. ఆదివారం కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోళి శ్రీనివాస్‌రెడ్డి, ము న్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు దశరథ్‌నాయక్‌తో కలిసి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడారు.
ప్రభుత్వ భవనం పేరుతో కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలోకి చొరబడి, అక్క డ సీఎం రేవంత్ ఫొటోను వేలాడదీయడంతోపాటు కార్యాలయంలో దాడికి పాల్పడటం హేయమైన చర్య అని ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్ర జాస్వామ్యంపై జరిగిన దాడేనని, ప్రజాస్వామ్యవాదులందరూ ఈ ఘటనను తీవ్రంగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతి పక్ష నాయకుడి కార్యాలయానికే రక్షణ లేకపోతే సా మాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని క్యాంప్ కార్యాలయాపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, సీఎం రేవంత్ ప్రోద్బలంతోనే దాడులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. వరుసదాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని..ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనలో శాంతి భధ్రతలు పకడ్బందీగా అమలు కావడంతో ప్రజలు ధైర్యంగా ఉండేవారని జైపాల్‌యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో మాత్రం అసాంఘిక శక్తులు పెట్రేగిపోతున్నాయని, వారి అరాచకాలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు, భయభ్రాంతులకు గురవుతున్నారని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. గజ్వేల్ ఘటనలో పాల్గొన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచుల సం ఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఖలీల్, రామకృష్ణ, సైదులు, చక్రధర్ పాల్గొన్నారు.