ఊట్కూర్, నవంబర్ 21 : మాగనూరు జెడ్పీహెచ్ఎస్లో బుధవారం మధ్యాహ్న భోజనం తిన్న వంద మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో దవాఖానలో చే రారు. తీవ్ర అస్వస్థతకు గురైన 15 మంది విద్యార్థులు మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మాగనూరు మండలంలో మూడు జెడ్పీహెచ్‌ఎస్‌లు, 4 ప్రాథమికోన్నత , 17 ప్రాథమిక, కస్తూర్బా పా ఠశాలలో 2,950 మంది విద్యార్థులు చదువుతున్నారు.
మధ్యాహ్న భోజనం వండే వంట ఏజెన్సీలకు సైతం నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో స్థానికంగా కిరాణా దుకాణాల్లో దొరికే నాసిరకం కోడి గుడ్లు, సరుకులను అప్పుకు తెచ్చి భోజనం వడ్డిస్తున్నారని, విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం పాఠశాల సందర్శనకు వచ్చిన అధికారులను పలు సమస్యలపై వారు నిలదీశారు.
మాగనూర్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్‌కు సంబంధించి హెచ్ఎం, ఇన్చార్జి ఎంఈవో మురళీధర్‌రెడ్డి, ఫుడ్ ఇన్చార్జి ఉపాధ్యాయుడు బాబుపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వంట ఏజెన్సీని రద్దు చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వికటించి అ నారోగ్యానికి గురికావడంతో సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా పరిగణించారు. బాధ్యులపై సీఎం చర్యలకు ఆదేశించగా గురువారం ఉదయం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాఠశాలలో విచారణ నిర్వహించారు.
ఆర్డీవో సమక్షం లో వంట ఏజెన్సీ బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి మధ్యాహ్న భోజనం వడ్డించారు. ఇదే సమయం లో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాఠశాలలో భోజనాన్ని పరిశీలించారు. అన్నంలో మళ్లీ పురుగులు రావడంతో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఓ పక్క విద్యార్థులు దవాఖానలో చికిత్స పొందుతుం టే.. అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ పురుగుల అన్నం వడ్డించడం ఏమిటని నిలదీశారు. అ నంతరం ఆయన సొంత ఖర్చులతో బియ్యం తెప్పించి వండించిన భోజనాన్ని వడ్డించారు.
మాగనూరు జెడ్పీహెచ్‌ఎస్‌కు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉదయం 9:30కు చేరుకుని మధ్యాహ్నం 11 గంటల వరకు విద్యార్థులు, తల్లిదండ్రులతో విచారణ జరిపారు. భోజనంలో కుళ్లిన గుడ్లు, ఉడికీ ఉడకని అ న్నం వడ్డించారని, వంట ఏజెన్సీల నిర్లక్ష్యంతోనే ఆహా రం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం బియ్యాన్ని పరిశీలించారు.
ద గ్గరుండి భోజనం వడ్డించేందుకు ఏర్పాట్లు చేయాలని డీఈవో అబ్దుల్‌ఘని, ఆర్డీవో రాంచందర్, ఎంపీడీవో ర హిమతుద్దీన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమను ఆదేశించి వెళ్లిపోయారు. కాగా, కలెక్టర్ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తూ యథావిధిగా పురుగుల అన్నంపెట్టారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో సాయంత్రం 5 గం టలకు జిల్లా అడిషనల్ కలెక్టర్ బెన్షాలాం పాఠశాలను సందర్శించి విచారణ జరిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఈవో అబ్దుల్‌ఘనిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆర్డీవో రాంచందర్, ఎంపీడీవో, రహిమతుద్దీన్, ఫుడ్ ఇన్స్‌స్పెక్టర్ నీలిమ, సివిల్ సప్లయ్ అధికారి దేవదాసులకు షోకాజ్ నోటీలను జారీ చేశారు.