మక్తల్, నవంబర్ 13: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్‌రెడ్డి అక్రమ అరెస్టు అనైతికమని మ క్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని ఫార్మా కంపెనీకి భూ ములు ఇవ్వడానికి ముందునుంచి వ్యతిరేకిస్తున్న లగచర్ల, రోటిబండ తండా, పులిచర్లతండా, దు ద్యాల, పోలేపల్లి, హకీంపేట గ్రామస్తులను బుధవా రం కలవడానికి వెళ్తున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అక్రమంగా చేసిన అరెస్టును ఖండిస్తూ బుధవారం విలేకరులతో మాట్లాడారు.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యే అయిన పట్నం నరేందర్‌రెడ్డికి ఆ ప్రాంతవాసులు తమ సమస్యలను ఫోన్లో తెలియజేస్తుంటారని.. అందులో భాగంగానే ఫార్మా బాధితులు కూ డా 4నెలలుగా ఫోన్లో తమ సమస్యలు చెప్పి ఉండొచ్చని.. న్యాయబద్ధంగా చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలియజేయాలని కోరి ఉండొచ్చని.. అంతమాత్రాన అధికారుల దాడి వెనకాల నరేందర్‌రెడ్డి ప్రోద్బలం ఉందని చెబుతూ అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్నారు.
రాబోయే ఎన్నకల్లో బీఆర్ఎస్ తరఫున ప్ర ధాన ప్రత్యర్థిగా నరేందర్‌రెడ్డి పోటీలో ఉండకూడదనే ఉద్దేశంతోనే పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. ఎకడైనా కంపెనీలు ఏర్పాటు చేస్తే ఆయా కంపెనీ యజమానులే రైతులకు నచ్చజెప్పి తమకు కావాల్సినంత భూమిని తీసుకొని కంపెనీలను ఏర్పాటు చేస్తారన్నా రు. కొడంగల్‌లో మాత్రం ప్రభుత్వమే దగ్గరుండి అ ధికారులతో ఒత్తిడి చేయించి రైతుల నుంచి బలవంతంగా భూములు ఇప్పించేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం విమర్శించారు. ఇలాంటి చ ర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి పాల్పడితే బీ ఆర్ఎస్ తరఫున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్‌గుప్తా, పట్టణాధ్యక్షుడు చిన్నహన్మంతు, మండలాధ్యక్షుడు ఎల్లారెడ్డి పాల్గొన్నారు.