మక్తల్, జూన్ 02 : కేసీఆర్ త్యాగ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సదర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మక్తల్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి యాదవ నగర్ రాఘవేంద్ర థియేటర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 సంవత్సరాల ఆంధ్ర వలస పాలకుల చేతుల్లో తెలంగాణ రాష్ట్రం ఆబాసు పాలయిందన్నారు. తెలంగాణ ప్రజలు వలస పాలకుల చేతుల్లో ఆగమవుతున్నారని గ్రహించిన కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలకు తెగించి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి స్వరాష్ట్ర కలను నెరవేర్చారన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టిందని మాజీ ఎమ్మెల్యే చిట్టి ఆరోపించారు. స్వరాష్ట్ర సాధనలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు అన్నిటిని నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అందించకుండగా, రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణను ఆగం చేయాలని పన్నాగం చేస్తుందని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీని గతంలో తొక్కినట్టే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు వాటిని నామరూపం లేకుండా చేయడం తధ్యమని హెచ్చరించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి, నాయకులు రాజుల ఆశి రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ గౌడ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు రాములు, మొగులప్ప, అన్వర్ హుస్సేన్, నాయకులు మారుతి గౌడ్, జుట్ల శంకర్, వెంకటయ్య గౌడ్, రాజు, మన్నన్, మంగలి నరసింహ, రాఘవేందర్ రెడ్డి, తీర్లాపురం కృష్ణ, అమ్రేష్, బండారి ఆనంద్, సాదిక్, ఉప్పరి సూరి, రాజు, రాఘవేందర్, ఎలగండ్ల బాలప్ప, అంజప్ప, ఆంజనేయులు, రాజు పాల్గొన్నారు.