తెలంగాణకు బీఆర్ఎస్తోనే రక్షణ
తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి బీఆర్ఎస్ పార్టీ చేపట్టే సభ్యత్వ నమోదు రక్షణ కవచంగా మారి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలని తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్అలీ అన్నారు. బుధవారం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అధ్యక్షతన మక్తల్ మున్సిపాలిటీలోని వెంకటేశ్వర గార్డెన్లో జరిగిన మక్తల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు సన్నాహ క సమావేశానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
- మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్అలీ
- తెలంగాణ అస్తిత్వాన్ని మసక బార్చేందుకు రేవంత్రెడ్డి కుట్ర
- మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
మక్తల్, జూన్ 3 : తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి బీఆర్ఎస్ పార్టీ చేపట్టే సభ్యత్వ నమోదు రక్షణ కవచంగా మారి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలని తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్అలీ అన్నారు. బుధవారం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అధ్యక్షతన మక్తల్ మున్సిపాలిటీలోని వెంకటేశ్వర గార్డెన్లో జరిగిన మక్తల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు సన్నాహ క సమావేశానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే రక్షణ కవచం అని ఏ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ అస్తిత్వాన్ని మసకబార్చేందుకు కుట్రలు చేస్తాయని, అందుకే రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులు ఎల్లవేళలా కృషి చేయాలని, అందులో భాగంగానే పార్టీ సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ కేసీఆర్ పద్నాగేండ్లు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఆంధ్ర వలస పాలకుల చేతుల్లో నష్టపోయిన తెలంగాణ ప్రాంతాన్ని, 10 సంవత్సరాల పాలనలో దేశానికే తలమానికంగా మారే విధంగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడుతున్న అరాచకాలను రూపుమాపాలంటే, పార్టీ చేపట్టే డిజిటల్ సభ్యత్వ నమో దు కార్యక్రమాన్ని మక్తల్ నియోజకవర్గంలో అత్యధిక శాతం నమోదు చేయించి తెలంగాణలోనే మక్తల్ నియోజకవర్గం ముందువరుసలోఓ ఉండేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఆస్తిత్వాన్ని మసకబారించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఆ కుట్రలను తిప్పకొట్టాలని పిలుపునిచ్చా రు. అంతకుముందు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు జన్మదినాన్ని పు రస్కరించుకొని మాజీ ఉపముఖ్యమం త్రి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, సభ్య త్వ నమోదు ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్,మక్తల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

